»   » హీరోలుకు ఆమె కావాలి..ఆమెకు డబ్బు కావాలి

హీరోలుకు ఆమె కావాలి..ఆమెకు డబ్బు కావాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : హీరోలు సాధారణంగా ఏ హీరోయిన్ ని రికమెండ్ చేస్తూంటారో ఆమెనే సినిమాలో తీసుకోవటం పరిపాటి. అలా హీరోలంతా ఆమెనే కావాలని కోరుకుంటే వెంటనే ఆమెకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుతం అదే పరిస్ధితి ఎదుర్కొంటోంది సమంత. అంతేకాక దర్శకులు సైతం ఆమెనే ప్రమోట్ చేస్తున్నారు. దాంతో ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోందని సమాచారం. దాంతో నిర్మాతలకు ఆమె ఎంత పెంచుతుందో అనే భయం పట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె కోటి పాతిక లక్షలు వరకూ వసూలు చేస్తోందని సమాచారం.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తోందట సమంత. అవకాశాలు ఉన్నప్పుడే చేతిలో నాలుగు రూపాయలు వెనుకేయడానికి తన పారితోషికాన్ని పెంచే యోచనలో ఉందట. తెలుగు, తమిళంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న నటి సమంత. నిన్నటి వరకు తెలుగు పరిశ్రమలోనూ జోరు చూపిన ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం కోలీవుడ్‌లో సందడి చేస్తోంది. ఇప్పటికే విజయ్‌కు జంటగా 'కత్తి', సూర్యతో 'అంజాన్‌'లో నటిస్తోంది.

విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో విక్రంకు జోడీగానూ ఎంపికైంది. వరుసగా స్టార్‌ హీరోల సరసన అవకాశాలు వస్తుండటంతో పారితోషికాన్ని పెంచాలనే యోచనలో ఉందట. త్వరలోనే దీనికి సంబంధించిన డిమాండ్‌ బయటపడే అవకాశముందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అయితే సమంతను పెట్టుకుంటే బిజినెస్ కూడా వెంటనే అయిపోతుందని భావిస్తున్నారు.

Samantha Hiked her Remuneration

గతేడాది ఆరు సినిమాలతో బిజీబిజీగా గడిపిన సమంత ఈ ఏడాది కూడా ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది చిత్రంతో కలిసి చేసిన దర్శకుడు త్రివిక్రమ్ తో మరోసారి పనిచేయటానికి సైన్ చేసి వార్తల్లో నిలిచింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ఆమె డేట్స్ ఇవ్వటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్రివిక్రమ్,అల్లు అర్జున్ గతంలో జులాయి చిత్రం చేసారు. ఈ సారి ఈ కొత్త చిత్రం కూడా అదే స్ధాయిలో యాక్షన్..ఎంటర్టైన్మెంట్ కలిపి ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వార్తల్లోకి వచ్చినా ఆ అదృష్టం సమంతనే వరించింది. అలాగే ఈ చిత్రానికి ఎప్పటిలాగే దేవిశ్రీప్రాసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మురెళ్ళ కెమెరా వర్క్, జులాయి నిర్మాత రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సమంత మాట్లాడుతూ....''ఈ ఏడాది కూడా వరుస షూటింగ్ లతో తీరిక లేకుండా గడపబోతున్నాను. 'ఆటోనగర్‌ సూర్య', 'మనం'తోపాటు వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా, ఎన్టీఆర్‌తో మరో సినిమా చేస్తున్నాను. తమిళంలో సూర్యతో 'అంజాన్‌' చేస్తున్నాను. ఇవన్నీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫలితం ఎలా ఉంటుందో అని కాస్త కంగారుగా ఉంది. అయితే లోలోపల ఈ అవకాశం నాకే వచ్చిందనే ఉద్వేగం కూడా ఉంది'' అని పేర్కొంది సమంత.

అలాగే ...''ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో... ఈ జన్మలో ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాను. నా తొలి సినిమా నుంచి నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. నా మంచి, చెడుల విషయంలో సొంత మనిషిలా ఆదరిస్తున్నారు. మీ అండతోనే నేనీ స్థాయికి చేరుకున్నాను. నా జీవితంలో అభిమానులు ఉంటే చాలు... ఇంకేమీ అక్కర్లేదు'' అంటోంది సమంత.

English summary
Samantha is now charging the remuneration of Rs.1.25 crores package for the forthcoming movie with Jr.NTR. The actress has increased her remuneration as a result of stiff competition between tollywood and kollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu