»   » హీరోయిన్ సంగీత సైతం అక్కడికే చేరింది

హీరోయిన్ సంగీత సైతం అక్కడికే చేరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సంగీత కూడా బుల్లి తెరపై తన ప్రతిభను ప్రదర్శించనుంది. గతంలో మర్మదేశం,చిదంబర రహస్యం అనే హర్రర్ సీరియల్స్ డైరక్ట్ చేసిన నాగ దర్శకత్వంలో తయారవుతున్న మణిమేఖలై లో ఆమె గెస్ట్ గా కనిపించనుంది. టీవీ సీరియల్స్ లో నటించటం సంగీతకు ఇదే మొదటి సారి. ఇంతకు ముందు విజయ్ టీవీలో సూపర్ హిట్ అయిన జోడీ నెంబర్ వన్ కి ఆమె దర్శకుడు ఎస్.జె.సూర్యతో కలిసి జడ్జిగా వెళ్ళింది. ఆమె దానికి జడ్జిగా వెళ్ళటం చూసి ఆ తర్వాత ఆ పోగ్రామ్ కి తమిళ నటుడు జీవా, శింబు, ఐశ్వర్యా ధనుష్ వంటి వారు వచ్చారు. ఇక ప్రస్తుతం సంగీత నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. అవి శ్రీమతి కళ్యాణం, దుర్గా, కుట్టి పస్సు, తంబికుట్టై చిత్రాలు. ఇక తంబి కుట్టై చిత్రంలో ఆమె బీడ పండెమ్మ అనే పేరు పొందిన లేడి డాన్ గా చేస్తోంది. ఇక టీవీ సీరియల్ గురించి సంగీత మాట్లాడుతూ...అతిథి పాత్ర. ఒకే ఒక్క భాగంలో నేను కనిపిస్తాను..మొత్తం సీరియల్‌కు నా పాత్ర కీలక మలుపు. అందుకే నటించేందుకు అంగీకరించాను. అయినా అప్పుడే బుల్లి తెరకు పూర్తిగా పరిమితమై పోవడం నాకు ఇష్టం లేదు...వెండి తెర మీద అవకాశాలు బాగానే వస్తున్నాయి. వాటిని కాదనుకొని బుల్లితెరకు వెళ్లడం అంత మంచిది కాదు అంటోంది. అయితే పెద్ద తెరపై డిమాండ్ లేకే బుల్లి తెరవైపు ఆమె మ్రొగ్గుచూపుతోందని, మొదట్లో అందరూ ఇలాగే బెట్టు పోతారని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇప్పటికే రాధిక, మహేశ్వరి, సిమ్రాన్, మీనా, రమ్యకృష్ణ, వాణీ విశ్వనాథ్‌ వంటివారు బుల్లి తెరకు తరలి వెళ్ళి విజయాలు సాధిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu