»   »  సంపాదనలో రజనీ, సూర్య, అజిత్, విజయ్‌ని మించిన సంతానం

సంపాదనలో రజనీ, సూర్య, అజిత్, విజయ్‌ని మించిన సంతానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోలు మహా అయితే సంవత్సరానికి మూడు లేదా నాలుగు సినిమాలు చేస్తారు. అయితే స్టార్ కమెడియన్లు మాత్రం సంవత్సరానికి 20కి పైగా సినిమాల్లో నటిస్తుంటారు. దీంతో కొందరు స్టార్ కమెడియన్ల సంపాదన స్టార్ హీరోలను సైతం మించి పోతోంది. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ జాబితాలో తమిళ కమెడియన్ సంతానం సంపాదన వివరాలు బయటకు వచ్చాయి. సంపాదన విషయంలో సంతానం.....రజనీకాంత్, సూర్య, అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోలను మించి పోవడం విశేషం. తమిళంలో స్టార్ హీరోలైన అజిత్, విజయ్ లకు ఫోర్బ్స్ 100 జాబితాలో అసలు చోటు దక్కలేదు.

ఫోర్బ్స్ విడుదల చేసిన 2015 టాప్ 100 జాబితాలో 52వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ జాబితాలో అతనిమనీ ర్యాంక్ 17 ఉండగా, ఫేమ్ ర్యాంక్ 91గా ఉంది. సంపాదన రూ. 45 కోట్లు. సంతానం కంటే ముందు వరుసలో కమల్ హాసన్(రూ. 51 కోట్లు), ధనుష్(42 కోట్లు) మాత్రమే ఉన్నారు. కోలీవుడ్‌లో సినిమాను బట్టి రూ.7 నుంచి 15 లక్షలు తీసుకునే సంతానం... తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా మరింత సంపాదన ఆర్జిస్తున్నాడని చెన్నై వర్గాలు చర్చించుకుంటున్నాయి.

నెం.1 స్థానంలో షారుక్ ఖాన్ (రూ. 257.5 కోట్లు) దక్కించుకున్నాడు. అయితే షారుక్ మనీ ర్యాంక్ 1, ఫేమ్ ర్యాంక్ 4గా ఉంది. ఆ తర్వాతి 2 స్థానంలో సల్మాన్ ఖాన్ (రూ. 202.75), మనీ ర్యాంక్ 2, ఫేమ్ ర్యాంక్ 2 గా ఉంది. తర్వాత అమితాబ్ బచ్చన్ 3వ స్థానంలో ఉన్నారు. ఆయన రూ. 112 కోట్ల సంపాదనతో మనీర్యాంక్ 5, ఫేమ్ ర్యాంక్ 1గా ఉంది.

టాప్ 10 లిస్టులో ఇంకా మహేంద్ర సింగ్ ధోనీ(రూ.119.33 కోట్ల), అమీర్ ఖాన్( రూ.104.25 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.127.83 కోట్లు), విరాట్ కోహ్లి (రూ.104.78 కోట్లు), సచిన్ (రూ.40 కోట్లు), దీపిక పదుకోన్ (రూ.59 కోట్లు), హృతిక్ రోషన్( రూ.74.5 కోట్లు) ఉన్నారు.

తెలుగు స్టార్స్ హీరోల సంపాదన వివరాలు

స్లైడ్ షోలో ఇతర తమిళ స్టార్ల వివరాలు....

శృతి హాసన్

శృతి హాసన్


శృతి హాసన్ ఈ లిస్టులో 61వ స్థానంలో ఉంది. మనీ ర్యాంక్ 74, ఫేమ్ ర్యాంక్: 47... సంపాదన 8 కోట్లు

రజనీకాంత్

రజనీకాంత్


టాప్ 100 లిస్టులో రజనీకాంత్ స్థానం 69. అతని సంపాదన 25 కోట్లు. ఫేమ్ ర్యాంక్ 80.

సూర్య

సూర్య


టాప్ 100 లిస్టులో సూర్య స్థానం 71, సంపాదన రూ. 32 కోట్లు, ఫేమ్ ర్యాంక్ 95.

ఆర్య

ఆర్య


ఆర్య స్థానం 80, సంపాదన రూ. 29 కోట్లు, ఫేమ్ ర్యాంక్ 100

రెహమాన్

రెహమాన్


రెహమాన్ 14వ స్థానంలో ఉన్నాడు. సంపాదన 43.97 కోట్లు. ఫేమ్ ర్యాంక్ 16

ప్రభుదేవా

ప్రభుదేవా


ప్రభుదేవా స్థానం 88, సంపాదన రూ. 11.5 కోట్లు. ఫేమ్ ర్యాంక్ 83.

English summary
Earlier, we had informed you about the list of 100 most richest and influential celebrities from India, which had two prominent Tamil celebrities in Thala Ajith and Ilayathalapathy Vijay. But surprisingly, the famous list from Forbes for the year 2015, has left out both Ajith and Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu