మహిళలకు క్షమాపణ చెప్పిన స్టార్ కమిడియన్

మహిళా సంఘాల వ్యతిరేకతతో మనసు మార్చుకున్నాడో ఏమో.. ద్వంద్వర్థాలు, అసభ్యకర సంభాషణలు పలికేందుకు నో చెబుతున్నాడు సంతానం. కార్తీ హీరోగా వచ్చిన 'బ్యాడ్ బోయ్(అలెక్స్ పాండియన్)'లో తన సోదరిపై పలికిన సంభాషణలు వ్యతిరేకతకు దారి తీశాయి.
ఆ వెంటనే డిల్లీ భెల్లీ రీమేక్ గా వచ్చిన ' క్రేజీ(సేటె)'లోనూ మహిళలను కించపరిచేలా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సంతానం తీరు మార్చుకోవాలంటూ కొన్ని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. స్పందించిన సంతానం ఇకపై మహిళల మనోభావాలు దెబ్బతినే సంభాషణల జోలికి వెళ్లనని ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











