»   » నిషేధంపై నిరాహారదీక్ష చేసాడు

నిషేధంపై నిరాహారదీక్ష చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : జల్లికట్టు తమిళుల పౌరుషానికి, సంస్కృతి, సంప్రదాయాలకు తార్కాణమని సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే, నటుడు శరత్‌కుమార్‌ తెలిపారు. జల్లికట్టుపై అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జల్లికట్టు, ఎద్దులబండి పోటీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ మదురైలో శరత్‌కుమార్‌ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలతోపాటు వందలాది మంది తమిళులు, జల్లికట్టు ప్రియులు పాల్గొన్నారు. శరత్ కుమార్ తెలుగులో అప్పటి గ్యాంగ్ లీడర్ నుంచి మొన్న వచ్చిన కాంచన చిత్రం దాకా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు.

నిరాహారదీక్షను ప్రారంభించిన అనంతరం శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. తమ తాత కారైక్కుడి సమీపంలోని తలక్కావూరులో ఓ జల్లికట్టు ఎద్దును పెంచేవారని తెలిపారు. దాన్ని 'పంచ కల్యాణి' అని పిలిచేవాళ్లమని, ఎలాంటి పోటీలోనైనా గెలుపొందడమే తన నైజంగా ఉండదేని చెప్పారు. ఆ ఎద్దు మృతిచెందినా.. ఇప్పటికి దానికి పూజలు చేస్తున్నామని అన్నారు. జల్లికట్లు కోసం ఢిల్లీకి వెళ్లయినా పోరాడుతామని ఆయన అన్నారు.

Sarath Kumar leads protest against ban on jallikattu

తమిళుల సంప్రదాయంతో అనుబంధమున్నవి జల్లికట్టు, ఎద్దలబండి పోటీలని చెప్పారు. తమిళగడ్డ ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. నిషేధం విధించేంత స్థాయిలో ఇందులో ఎలాంటి నేరం లేదని, దీనిపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు వెంటనే ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

English summary
A large number of bull owners led by All India Samathuva Makkal Katchi (AISMK) founder Sarath Kumar observed a day-long hunger strike demanding the central government to initiate efforts to revoke the Supreme Court imposed ban on jallikattu in Madurai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu