హిందువులను అవమానించారంటూ ఖష్బూ మరో వివాదం
చెన్నై: గతంలో పెళ్లికి ముందు సెక్స్ ని సమర్దిస్తూ వ్యాఖ్యలు చేసి కష్టాలు తెచ్చుకున్న నటి ఖుష్బూ మరో వివాదంలో ఇరుక్కుంది. హైదరాబాద్ లో జరిగిన ఓ సినీ కార్యక్రమానికి ఆమె కట్టుకొచ్చిన చీర కాంట్రావర్శికి దారి తీసింది. హనుమంతుడు,రాముడు,కృష్ణుడు,నరసింహ స్వామి చిత్రాలున్న చీర ధరించి వచ్చారు. దాంతో ఆమె పదేపేద హిందువల మనోభావాలు దెబ్బ తీస్తోందని,ఖుష్బూ క్షమాపణ చెప్పాలని హిందూ మక్కల్ కట్చి డిమాండ్ చేసింది.
గతంలోనూ...హిందూ దేవతలను అవమానించారని ఆమె వివాదంలో ఇరుక్కున్నారు. చెన్నైలో జరిగిన ఓ సిని ప్రారంభోత్సవ పూజ సందర్భంగా ఆమె చెప్పులు ధరించి దేవతల విగ్రహాల వ్దద కూర్చున్నారు. ఆ ఫోటోలు ప్రముఖంగా పత్రికల్లో వచ్చి వివాదం రేపాయి. లక్ష్మి,సరస్వతి,పార్వతి విగ్రహాల ముందు చెప్పులు వేసుకుని కూర్చుని ఆమె కావాలని హిందువుల మనోభావాలు దెబ్బతీసారని, గురుమూర్తి అనమే హిందూత్వవాది చెన్నై సివిల్ కోర్టు లో ప్రజా ప్రయోజ వ్యాజ్యం వేసారు.
ఇక ఈ విషయమై ఖుష్బూ మీడియాతో మాట్లాడుతూ...నేను ఇలాంటివి పట్టించుకోను..నాకేమీ అందులో తప్పేమి కనిపించలేదు అని చెప్పారు. హిందూ మక్కల్ కట్చి చెన్నై జోన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ..ఆమె ఇది కావాలనే చేసింది. ఆమె ఇంటెన్షన్ ఈ వివాదం ద్వారా పబ్లిసిటీ పొందటమే అన్నారు. అలాగే..హిందూ దేవతలను కోట్ల మంది ఆరాధిస్తారు. ఎవరూ కూడా ఇలా వారి బొమ్మలు ఉన్న బట్టలు ధరించరు...ఆమె క్షమాపణ చెప్పితే సమస్య లేదు. లేకపోతే ఈ విషయమై ఆందోళనకు దిగుతాం అని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











