»   » 'నిత్యానందం'లో మణిరత్నంను ముంచేసిన రాసలీలల రంజిత

'నిత్యానందం'లో మణిరత్నంను ముంచేసిన రాసలీలల రంజిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఏ ముహూర్తాన రావణ చిత్రాన్ని మొదలపెట్టాడో కానీ ఆది నుండీ ఈ సినిమా సమస్యల నడుమ సతమతమవుతోంది. మణిరత్నంకు హార్ట్ అటాక్ రావడం, సినీ యూనిట్ మీద ఏనుగు దాడి చెయ్యడం, ఐశ్వర్యా రాయ్ కు స్వైన్ ఫ్లూ రావడం లాంటి సంఘటనలతో ఈ సినిమా విడుదలలో భారీగా జాప్యం జరిగింది. ఇక ఈ సినిమాను ఎలాగయినా వచ్చే వేసవికి విడుదల చెయ్యాలనుకుంటున్న మణిరత్నంకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

ఇంతకాలం నిత్యానందుని కొలువుతో నిత్యానందంతో ఓలలాడిన రాసలీలల తార రంజిత మణిరత్నం గారి 'రావణ' చిత్రంలో ఓ పాత్రపోషించిందట. కానీ నిత్యానందుని మీద ఆమె గారి అమితమయిన భక్తిప్రపత్తులు ప్రపంచానికి తెలియడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె ఎక్కడుందో ఎవ్వరికీ తెలియట్లేదు. ఇక ఆమె నటించాల్సిన కొన్ని సన్నివేశాలు బాకీ వుండటంతో మణి యూనిట్ ఆమెను కాంటాక్ట్ చెయ్యడానికి ఎంత ప్రయత్నించినా ఆమె దొరకడం లేదట. దీంతో ఈ రాసలీలల రాణి గారి ఆచూకీ కోసం వీరు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారట..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu