»   » సీక్వెల్ కు కమల్‌, రజనీకాంత్‌ ఓకే చేసారు

సీక్వెల్ కు కమల్‌, రజనీకాంత్‌ ఓకే చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shankar planning for Robo and Bharateeyudu sequels
చెన్నై : హిట్ చిత్రాలకు కొనసాగింపుగా సీక్వెల్‌ వస్తున్న రోజులివి. తమిళంలో ఇప్పటికే 'విశ్వరూపం-2', 'జైహింద్‌-2' విడుదలకు సిద్ధమవుతున్నాయి. అగ్ర దర్శకుడు శంకర్‌కు కూడా ప్రస్తుతం ఈ తరహా సినిమాలు రూపొందించనున్నారట. ఇందులో భాగంగా తన దర్శకత్వంలో రూపొందించిన 'భారతీయుడు‌', 'రోబో‌'కు సీక్వెళ్లను తీయాలనే భావిస్తున్నారట. ఈ విషయాన్ని కమల్‌, రజనీకాంత్‌కూ చెప్పారట. ఇద్దరూ దీనికి అంగీకరించారని కోలీవుడ్ సమాచారం. దీంతో తొలి భాగాలకన్నా సీక్వెళ్లను బ్రహ్మాండంగా రూపొందించే సన్నాహాల్లో ఉన్నారట శంకర్‌.

స్టార్‌ హీరోలతో సమానంగా పేరు సంపాదించుకున్న దర్శకుల్లో ముందు వరుసలో ఉంటారు శంకర్‌. భారీతనం, వైవిధ్యం కలగలిపితే శంకర్‌ అనుకోవచ్చు. సినిమా సినిమాకీ కొత్తదనాన్ని చూపిస్తూ వస్తున్నారాయన. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం 'ఐ'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగులో 'మనోహరుడు'గా తీసుకొస్తున్నారు. విక్రమ్‌, అమీ జాక్షన్‌ జంటగా నటిస్తున్నారు. ఆస్కార్‌ ఫిలింస్‌ పతాకంపై వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు.

శంక‌ర్ రోబో మూవీ వ‌చ్చి మూడు సంవ‌త్సరాలు అవుతున్నా, శంక‌ర్ డైరెక్షన్ నుండి ఆ రేంజ్ మూవీ ఇప్పటి వ‌ర‌కూ రాలేదు. మ‌ధ్యలో స్నేహితుడు మూవీను తీసినా అది కోళీవుడ్‌లోనూ అంతంత మాత్రంగా విజ‌యం సాధించింది. తెలుగులో అయితే స్నేహితుడు మూవీను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో శంక‌ర్ ఫుల్ మార్క్ ఉన్న ఫిల్మ్‌గా ఐ చిత్రం క్రేజ్ సంపాందించుకుంది.

అలాగే శంకర్ తన తదుపరి చిత్రానికి హీరోని ఖరారు చేసారని కోలీవుడ్ సమాచారం. ఆ హీరో మరెవరో కాదు వరస హిట్స్ తో దూసుకుపోతున్న అజిత్. అజిత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతోందని అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఎప్పటినుంచో అజిత్‌తో శంకర్‌ సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'రోబో'లో అజిత్‌ నటించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కథ షారుక్‌ఖాన్‌కు, తర్వాత రజనీకాంత్‌ వద్దకు చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 'వీరం' విజయంతో ఉన్న అజిత్‌.. ప్రస్తుతం గౌతం మీనన్‌ దర్శకత్వంలో తన 55వ చిత్రంలో నటిస్తున్నాడు.

English summary
Now, there is a strong buzz in the Tamil Film Industry that sensational director Shankar is in a mind to make a sequels for his own films. Bharateeyudu and Robo are the proposed two movies that he want to direct, which were blockbusters on their own terms which starred Kamal Hasan and Rajinikanth in the lead roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu