»   » హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ తో దర్శకుడు శంకర్ టై అప్

హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ తో దర్శకుడు శంకర్ టై అప్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shankar
చెన్నై : తెలుగు,తమిళ భాషల్లో స్టార్ డైరక్టర్ గా వెలుగుతూ, ప్రభం'జన' దర్శకుడిగా పేరు సంపాదించుకున్న శంకర్‌ పలు చిత్రాలను నిర్మించారు. 'వెయిల్‌', 'ఈరం', 'అరై ఎన్‌.305ల్‌ కడవుల్‌'.. వంటివి ఆయన నిర్మాణంలో వచ్చినివే. ఇవి కథపరంగా జనాలను ఆకట్టుకున్నా కాసులు రాల్చలేకపోయాయి. తన నిర్మాణ అడుగులను ఆపేశాడు శంకర్‌. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్టూడియోస్‌తో కలసి పలు విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్నారు. శంకర్‌కు కూడా అదే ఆలోచన తట్టింది.

శంకర్‌ నిర్మాతగా ఎస్‌.పిక్చర్స్‌ కూడా ఫాక్స్‌ స్టార్‌తో కలసి త్వరలో చిత్రాలను జనం ముందుకు తీసుకురానుంది. ఈ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్మాణ రంగంలో మళ్లీ అడుగుపెడుతున్నాడట శంకర్‌. ఇక శంకర్ ప్రస్తుతం 'ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది.


ఈ చిత్రంకోసం విక్రమ్...శరీరంలో చాలా మార్పులు చేసుకున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ కొన్ని ప్రయోగాలు చేశారు. పదిహేనేళ్ల బాలుడిగానూ, 85యేళ్ల వృద్ధుడిగానూ కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన తన దేహశైలిని కూడా మార్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తులు చేశారు. ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు.


ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ఐ చిత్రం కాన్సెప్ట్ లీక్ అయ్యిందంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది.

English summary
Fox International (FI), part of the Rupert Murdoch's owned News Corporation, in a bid to promote regional movies has tied up with noted Tamil director Shankar to produce and distribute Tamil films in the country. Fox STAR Studios is the joint venture between motion films distributor and producer Twentieth Century Fox Corporation and leading media company STAR both, owned by News Corpration. Fox STAR Studios has partnered with Shankar promoted S Pictures Productions as per the agreement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu