»   » తెలుగు లో హిట్ ...తమిళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు

తెలుగు లో హిట్ ...తమిళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై‌: కె.యస్‌.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొంది,విజయవంతమైన సినిమా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మించారు. తెలుగులో మంచి విజయంసాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘నీ నాన్ నామ్' (నువ్వు, నేను, మనం) అన్న పేరుతో విడుదల చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇప్పటికే తమిళంలో రెండు స్ట్రైయిట్ చిత్రాల్లో నటించిన శర్వానంద్ కు అక్కడ మంచి మార్కెట్ ఉంది. అలాగే హీరోయిన్ గా చేసిన నిత్యామీనన్‌కు కూడా తమిళంలో మంచి మార్కెట్ ఉండటం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఒకే బంగారం' సక్సెస్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అక్కడ మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.


చిత్ర సమర్పకుడు మాట్లాడుతూ ‘‘మా సంస్థలో వస్తున్న మరో బ్యూటీఫుల్‌ యూత్‌ లవ్‌ స్టోరీ ఇది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేమ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా. శర్వానంద్‌, నిత్యామీనన్‌ లాంటి వెర్సటైల్‌ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. గోపీసుందర్‌ మంచి సంగీతాన్నిచ్చారు. క్రాంతిమాధవ్‌ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో ఆడియో, సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


Sharwanand’s hit film ‘Malli Malli Idi Rani Roju’ to release in Tamil

విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఓ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ.


దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.... పరిణితి చెందిన ప్రేమకథా చిత్రమిది. హృదయాల్ని మెలిపెట్టే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయి. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు మనసును కదిలించేలా వుంటాయి. శర్వానంద్ ఈ చిత్రంలో క్రీడాకారుడిగా కనిపిస్తారు. నిత్యామీనన్ పాత్రలో రెండు భిన్న పార్శాలుంటాయి అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ ‘‘మా సంస్థలో వస్తున్న మరో బ్యూటీఫుల్‌ యూత్‌ లవ్‌ స్టోరీ ఇది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేమ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా. శర్వానంద్‌, నిత్యామీనన్‌ లాంటి వెర్సటైల్‌ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. గోపీసుందర్‌ మంచి సంగీతాన్నిచ్చారు. క్రాంతిమాధవ్‌ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


ఈ సినిమాకు కెమెరా: జ్ఞానశేఖర్‌.వి.యస్‌., మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Sharwanand's new movie ‘Malli Malli Idi Rani Roju’ is all set to be released as ‘Nee Naan Naam’ in Tamil.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu