For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుకున్నదే నిజమైంది, షాకింగ్ న్యూస్ విని రజనీ ఫ్యాన్స్ డీలా

  By Srikanya
  |

  చెన్నై: అనుకున్నట్లే అయ్యింది... అందరూ అనుమానిస్తదే నిజమైంది. రజనీ అభిమానులుకు ఆయనంటే పిచ్చి, ఈ మధ్యన వరస ప్లాఫ్ లు వచ్చినా ఆయన క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. దాన్ని ప్రూవ్ చేస్తూ.. 'కబాలి రా..' అంటూ టీజర్‌తోనే రికార్డుల మోత మోగించేశారు సూపర్‌స్టార్‌. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు ఓ బాధకరమైన వార్త. అది వినగానే ఫ్యాన్స్ డీలా పడిపోయారు.

  అదేమిటంటే...పి.ఎ. రంజిత్‌ దర్శకత్వం వహించిన 'కబాలి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.

  వాస్తవానికి మొదట అనుకున్న దాని ప్రకారం జూన్‌ 12న 'కబాలి' ఆడియో వేడుక జరగాల్సి ఉంది. అయితే రజనీకాంత్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వేడుక ఖరారు చేసిన తేదీ నాటికి ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో నేరుగా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు డీలా పడిపోయారు.

  తమ అభిమాన హీరోని ఆడియో వేడుక సందర్భంగానైనా చూడవచ్చని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో రజనీ సరసన రాధిక ఆప్టే నటించారు. జులై 1న 'కబాలి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది.

  మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కబాలి చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించాడు . ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కబాలి ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

  SHOCKER: No Audio Launch For Rajinikanth's 'Kabali', Film Might Be Postponed!

  ఇక మేడే నాడు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో విడుదలైన కబాలి టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ టీజర్ ని ఇప్పటి వరకు 20 మిలయన్ల కన్నా ఎక్కువ మందే వీక్షించారు. ఈ టీజర్ తో రజనీ తన స్టామినా ఏంటో నిరూపించుకోవడమే కాక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇంత వరకు ఏ చిత్ర టీజర్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదని తెలుస్తోంది.

  రజనీకు ఒక్క తమిళనాటే కాక ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండడంతో ఈ సినిమాను వీలైనంత మేరకు అన్ని ఏరియాల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన రజనీ చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ చెక్కు చెదరని క్రేజ్ రజనీ సొంతం కావడంతో తలైవా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు .

  English summary
  If sources are anything to go by, the plan for the audio launch of superstar Rajinikanth's Kabali has been scrapped and the music will now directly hit the stores on June 12. "Rajinikanth sir is holidaying in the US and he won't be present in the country around the time of the launch. Hence, the makers decided to have a soft launch instead," a source from the film's unit told
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X