»   » షెల్టర్ కావాలంటూ హీరో సిద్దార్ద రిక్వెస్ట్

షెల్టర్ కావాలంటూ హీరో సిద్దార్ద రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తన క్రూ ఫ్యామిలీస్ షిప్ట్ అవటానికి అపార్టమెంట్స్ వెతుకుతున్నాం అంటున్నారు సిద్దార్ద. చాలా మంది తన ఆఫీస్ లోనూ, ఇంటి వద్ద చాలా మంది షెల్టర్ కోసం ఉన్నారని, ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి ఫ్లాట్ ఉంటే చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసారు సిద్దార్ద.

కొద్ది రోజుల క్రితం... సిద్దార్ద నేషనల్ మీడియాపై విరుచుకు పడ్డారు. తమ తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాల్లో వరదలు ప్రజలను ముంచెత్తుతుంటే.. జాతీయ మీడియా ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నను స్పందించారు.

చెన్నైలోని వరద బీభత్సాన్ని పట్టించుకోకుండా.. ఆమీర్‌ ఖాన్‌, షీనా బోరాలకు సంబంధించిన అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. సిద్ధార్థ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్యలు చేస్తూ.. మా గురించి కూడా మాట్లాడండి అంటూ జాతీయ మీడియాకి విజ్ఞప్తి చేశారు.

ఇక గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై స్తంభించిపోయింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. ఆదివారం సాయంత్రం అతిభారీ స్థాయిలో 69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. తమిళనాడులోని పలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. పంటపోలాలు నీటమునిగాయి.

Siddardha request for his friends

పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి జయలలిత అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. దెబ్బదిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జయలలిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ మంత్రి ఆర్.బి. ఉదయ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు.

కాగా, భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 4 ఎక్స్ గ్రెషియా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆస్తినష్టం కలిగిన పేదలకు తక్షణ సాయంగా రూ. 20 వేలు అందజేయనున్నట్లు మంత్రి ఉదయ కుమార్ తెలిపారు. థేని, శివగంగా, దిండిగల్, నమక్కళ్ జిల్లాల్లో నష్టం పాళ్లు తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. అటు పాండిచేరి, లక్ష్యద్వీప్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని పలు తీరప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది.

English summary
Siddharth tweeted: "Looking for apartments to shift families of my crew. Lots of people in my office and home for shelter. Please share information about flats."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu