twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో సిద్దార్థ్ తల్లిదండ్రులకు చేదు అనుభవం.. 20 నిమిషాలపాటు వేధింపులు అంటూ పోస్ట్

    |

    తమిళనాడులోని మధురై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై
    సినీ నటుడు సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రులను వేధింపులకు గురిచేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టులో సెక్యూరిటీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో తన తల్లిదండ్రులకు ఎదురైన వేధింపుల గురించి తెలియజేస్తూ..

    నా తల్లిదండ్రులకు మధురై ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ సిబ్బందితో చేదు అనుభవం ఎదురైంది. వారి బ్యాగుల్లో నుంచి కాయిన్స్ బయటకు తీయించారు. వారు ఏకధాటిగా హిందీలో మాట్లాడుతూ వారిని విసిగించారు. ఇంగ్లీష్‌లో మాట్లాడమని పలుమార్లు కోరినా వినిపించకోకుండా హిందీలోనే మాట్లాడారు. అయితే వారి ప్రవర్తన పట్ల నా తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తే.. ఇండియాలో రూల్స్ ఇలానే ఉంటాయి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

    Siddharth complaint against CISF personnel over harassment to His parents in Madurai Airport

    నా తల్లిదండ్రులను 20 నిమిషాలపాటు మధురై ఎయిర్‌పోర్టులో సీఆర్పీఎఫ్ సిబ్బంది వేధించారు. ఉద్యోగం లేని వారు తమ పవర్‌ను చూపిస్తున్నారు అంటూ సిద్దార్థ్ ఘాటుగా స్పందించారు.

    ఇదిలా ఉండగా, సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షణలో మధురై ఎయిర్‌పోర్టు ఉంది. అయితే సిద్దార్థ్ చేసిన ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    Siddharth complaint against CISF personnel over harassment to His parents in Madurai Airport

    సినీ నటుడు సిద్దార్థ్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్నాడు. ఇటీవల తెలుగులో మహా సముద్రం అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నాడు.

    English summary
    Actor Siddharth shared on his Instagram Stories that, Harassed for 20 mins Madurai airport by CRPF. They made my senior parents remove coins from their bags! And repeatedly talked to us in Hindi after being told to speak in English
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X