twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెరుగైన చికిత్స కోసం శింబు తండ్రిని అమెరికాకు తరలింపు.. నా కొడుకు కోసమే అంటూ టీ రాజేందర్ ఎమోషనల్

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన దర్శక, నిర్మాత టీ రాజేందర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కొద్ది నెలలుగా ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తరలించారు. అయితే టీ రాజేందర్ అమెరికాకు వెళ్తూ చెన్నై విమానాశ్రయంలో ఎమోషనల్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

    అమెరికాలో మెరుగైన చికిత్సను పొందేందుకు వెళ్తున్నాను. మొత్తం 12 రోజులపాటు నేను అక్కడే ఉంటాను. వెండు తన్నాదాధు కాదు.. పాథూ తలా చిత్రాలకు దూరం అవుతున్నాను. నేను నా కొడుకు కోసమే అమెరికాకు వెళ్తున్నాను. నా కొడుకు నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాడు. అందుకే నేను అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. నా కొడుకు మంచి నటుడే కాదు.. తల్లిదండ్రులను ప్రాణం కంటే మిన్నగా చూసుకొనే కొడుకు అని టీ రాజేందర్ ఎమోషనల్ అయ్యారు.

     Simbu father T Rajender gets emotional at Chennai airport while going to America for better treatment

    చెన్నై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో స్వయంగా వచ్చి.. నన్ను పరామర్శించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు, రాజకీయ వేత్త కమల్ హాసన్, వేల్స్ గ్రూప్ అధినేత ఇషారీ గణేష్, ఎస్ఆర్‌ఎం గ్రూప్ అధినేత పచైముత్తుకు ధన్యవాదాలు అని ఎమోషనల్ అయ్యారు.

    అమెరికా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకం ఉంది. నేను అమెరికా నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం గురించి మీడియా సమావేశం పెట్టి చెబుతాను అని టీ రాజేందర్ అన్నారు.

    English summary
    Simbu father T Rajender gets emotional at Chennai airport while going to America for better treatment. Rajender said, He was going for son Simbu request.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X