»   » షాక్: నయనతారపై కంప్లైంట్ చేసిన శింబు

షాక్: నయనతారపై కంప్లైంట్ చేసిన శింబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై:శింబు ప్రస్తుతం నయనతారతో కలిసి'ఇదు నమ్మఆళు' అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతారతోనూ ఇదివరకు ప్రేమాయణం సాగించాడు శింబు. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడిపోయారు. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రమే మరోసారి వీరి మధ్యన విభేధాలు పెరగటానికి కారణమవబోతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం కొద్ది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు నయనతార తాను ఇక సినిమాలో నటించనని తేల్చి చెప్పిందని సమాచారం. దాంతో వేరే దారి లేక చిత్రం హీరో శింబు ఆమెపై కంప్లైంట్ చేసారు.

శింబు రీసెంట్ గా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అశోశియేషన్ ని కలిసి ఆమెపై కంప్లైంట్ చేసారు. ఆమె చిత్రం విషయంలో కోఆపరేట్ చేయకపోవటంతో చాలా నష్టపోవాల్సి వస్తుందని తెలియచేసారు.

ఈ విషయమై నయనతార మీడియాతో మాట్లాడుతూ... "నేను ఈ చిత్రం కోసం ఇచ్చిన డేస్ ఇప్పటికే అయిపోయాయి. వారు వాటిని వాడుకోలేదు. ఇప్పుడు నేనే వేరే ప్రాజెక్టులలో పూర్తి బిజీగా ఉన్నాను. ఆ చిత్రం కోసం ఫ్రెష్ గా కాల్ షీట్స్ పరిస్ధితుల్లో లేను. అలా చేస్తే మిగతా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుంది " అని ఆమె తేల్చి చెప్పారు. ఇంకా ఓ పాట,కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి.

ఈ చిత్రాన్ని టి రాజేందర్, ఉషా రాజేందర్, శింబు, కులరాసన్, ఇలైక్య తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. శింబు సినీ ఆర్ట్స్ పేరిట నిర్మిత మవుతున్న ఈ చిత్రానికి పసంగ చిత్రంతో నేషనల్ అవార్డు పొందిన పండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

స్లైడ్ షోలో ..అసలేం జరిగింది అనే విషయాలు

మిగిలిన రెమ్యునేషన్

మిగిలిన రెమ్యునేషన్

తనకు ఇవ్వవలిసిన బ్యాలెన్స్ రెమ్యునేషన్ ఇప్పించాల్సిందని నయనతార మరో ప్రక్క నటీనటుల సంఘంలో పిర్యాదు చేసారు

దర్శకుడు మీదా

దర్శకుడు మీదా

ఇంతకుముందు శింబు..ఈ చిత్రం దర్శకుడు పాండిరాజ్ మీద కూడా కంప్లైంట్ చేసారు. లేటుకు కారణం అతనే అని

ఆర్దిక ఇబ్బందులే

ఆర్దిక ఇబ్బందులే

దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ..తన చేతిలో ఏమీ లేదని, నిర్మాతలు ఫైనాన్సియల్ ట్రబుల్సే లేటుకు కారణమని అన్నారు.

సంగీత దర్శకుడు కూడా

సంగీత దర్శకుడు కూడా

దర్శకుడు మాట్లాడుతూ...శింబు సోదరుడు సంగీత దర్సకుడు అని అతను ఓ పాటను లేటు చేసారని ఆరోపించారు

ఫ్రెండ్స్ కాదు శతృవులు

ఫ్రెండ్స్ కాదు శతృవులు

మొదటి వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగ ఉందామని ఈ ప్రాజెక్టు సైన్ చేసారు. ఇప్పుడు శతృవులుగా మారారు

ఏమౌతుంది

ఏమౌతుంది

ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో అని తమిళ పరిశ్రమ చాలా ఆసక్తిగా చూస్తోంది.

English summary
Idhu Namma Aalu is once again in the soup as according to the latest report Nayantara has refused to be a part of the movie anymore, leaving Simbu with no other option but to forward a formal complaint against her. It is said that the Vaalu actor approached Tamil Film Producers Council and South Indian Film Artistes' Association (Nadigar Sangam) and filed a complaint against the chassy actress for not co-operating toward the completion of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu