twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా అట్టర్ ప్లాప్ అందుకే, కథలో వేలు పెట్టాడు.. కోర్టుకెక్కిన హీరో!

    |

    తమిళ చిత్ర పరిశ్రమలో హీరో శింబు, విశాల్ పేర్లు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఎదో ఒక వివాదంలో కనిపిస్తోనే ఉంటారు. తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శింబు అట్టర్ ప్లాప్ చిత్రానికి సంబంధించిన వివాదం విశాల్ మెడకు చుట్టుకుంది. 2017లో శింబు అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి మైఖేల్ రాయప్పన్ నిర్మాత. శింబుకు , రాయప్పన్ కు ఈ చిత్ర విషయంలో గొడవ జరుగుతూనే ఉంది.

    కథలో జోక్యం చేసుకున్నాడు

    కథలో జోక్యం చేసుకున్నాడు

    అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్ర సమయంలో శింబు సరిగా షూటింగ్ కు వచ్చేవాడు కాదు. పైగా కథ విషయంలో జోక్యం చేసుకున్నాడు.దీని ఫలితంగానే సినిమా డిజాస్టర్ గా నిలిచి నాకు తీవ్రమైన నష్టాలని మిగిల్చిందని రాయప్పన్ ఆరోపిస్తున్నారు. తనకు శింబు నష్టపరిహారం చెల్లిచేలా చర్యలు తీసుకోవాలని రాయప్పన్ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. ఈ వివాదం విషయంలో శింబుని వివరణ అడుగుతూ నిర్మాతల మండలి నోటీసులు జారీ చేసింది.

    శింబు కొత్త చిత్రానికి చిక్కులు

    శింబు కొత్త చిత్రానికి చిక్కులు

    రాయప్పన్ వివాదంపై శింబు స్పందించక పోవడంతో నిర్మాతల మండలి అతడిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో శింబు కొత్త చిత్రం వందా రాజవదాన్ వరువేం చిత్ర విడుదల విషయంలో చిక్కులు ఏర్పడేలా కనిపిస్తోంది. దీనితో శింబు హై కోర్టుని ఆశ్రయించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, రాయప్పన్ పై పిటిషన్ దాఖలు చేశారు.

     5 కోట్లే తీసుకున్నా

    5 కోట్లే తీసుకున్నా

    అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రానికి తాను నిర్మాతతో 8 కోట్ల రెమ్యునరేషన్ ఒప్పందం చేసుకున్నా. కానీ నాకు నిర్మాత కేవలం 5 కోట్లు మాత్రమే చెల్లించాడు. అయినా కూడా నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని శింబు పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ అనవసర పంచాయతీకి నిర్మాతల మండలి చైర్మన్ విశాల్ సహకరిస్తున్నాడని శింబు ఆరోపించాడు.

    కౌంటర్ దాఖలు చేయండి

    కౌంటర్ దాఖలు చేయండి

    శింబు వేసిన ఫిటిషన్ విచారణ మంగళవారం జరిగింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు విశాల్ ని, రాయప్పన్ ని ఆదేశించింది. తన కొత్త చిత్రం విషయంలో నిర్మాతల మండలి ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలనీ శింబు కోర్టుని కోరాడు.

    English summary
    Simbu files defamation case against 'AAA' producer!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X