»   » అభిమాని ఆత్మహత్యాయత్నంపై శింబు స్పందన...

అభిమాని ఆత్మహత్యాయత్నంపై శింబు స్పందన...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు శింబు నటించిన ‘వాలు' తమిళ చిత్రం వివిధ సమస్యలతో విడుదల కావడం లేదు. తమిళ సీని పరిశ్రమలో శింబు సినిమా విడుదల కాకుండా కుట్ర జరుగుతోందని ఆయన తండ్రి రాజేంద్రన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సినిమా ఆలస్యం కావడాన్ని తట్టుకోలేని శింబు అభిమాని ఒకరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు.

ఈ సంఘటనపై శింబు స్పందిస్తూ...ఈ సంఘటన నన్ను ఎంతో బాధించింది. దయచేసి ఎవరూ ఇలాంటివి చేయొద్దు. అభిమానులు శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమా విడుదల ఆలస్యం కావడంతో తాను కూడా నిరాశలో ఉన్నానని, అయితే అభిమానుల అండతోనే ధైర్యంగా ఉన్నట్లు తెలిపాడు.

Simbu's Fan Tries to Commit Suicide over 'Vaalu' Delay

శింబుపై కుట్ర జరుగుతోందని, తన చిత్రాన్ని విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని నటుడు, నిర్మాత అయినత టి.రాజేంద్రన్ ఆందోళన వ్యక్తం చేసారు. ‘వాలు' చిత్రాన్ని జులై 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. కానీ మళ్లీ వాయిదా పడింది. ఈ చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, హన్సిక, సంతానం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
A fan of Simbu has attempted to commit suicide over the delay in release of the actor's latest flick "Vaalu".
Please Wait while comments are loading...