twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా నాన్నే కాబోయే సీఎం.. అజిత్ ఫాన్స్‌ని రెచ్చగొట్టేలా, శింబు తమ్ముడు అలా చేశాడా!

    |

    సినిమా, రాజకీయాలని వేరు చేసి చూడలేం. రాజకీయాల్లో ప్రభావం చూపిన సినీప్రముఖులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లో. ఎంజీఆర్ మొదలుకుని ఎన్టీఆర్, జయలలిత వంటి సినీదిగ్గజాలు రాజకీయాల్లో రాణించారు. ఇదిలా ఉండగా జయ మరణం తరువాత తమిళ రాజకీయాల్లో కొంత అనిశ్చితి ఏర్పడింది. ఆమె స్థానాన్ని భర్తీ చేయగలిగే ధీటైన నాయకుడి కోసం జయలలిత అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సుశీంద్రన్ అజిత్ రాజకీయాల్లోకి రావాలని లెటర్ విడుదల చేయడం వివాదంగా మారింది. తాజాగా ఈ వివాదంలో శింబు సోదరుడు కురలరాసన్ పేరు వినిపిస్తోంది.

     సుశీంద్రన్ రిక్వస్ట్

    సుశీంద్రన్ రిక్వస్ట్

    అజిత్ రాజకీయాల్లోకి రావాలంటూ ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ లెటర్ రిలీజ్ చేయడం వివాదంగా మారింది. 40 ఏళ్లుగా తమిళ రాజకీయాలు మారలేదని , మీరు వస్తే మార్పు సాధ్యం అని సుశీంద్రన్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అజిత్ ఇప్పటికే రాజకీయాలు తనకు సంబంధం లేని విషయం అని ప్రకటించారు. అజిత్ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకుండా ఇలా లెటర్ రిలీజ్ చేయడం ఏంటని కొందరు అజిత్ ఫాన్స్ మండిపడ్డారు.

    మరోవివాదం

    మరోవివాదం

    ఈ వివాదం ముగిసింది అనుకుంటున్న సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శింబు సోదరుడు కురలరాసన్ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి సుశీంద్రన్ పోస్ట్ కు రిప్లయ్ వచ్చింది. సుశీంద్రన్ అజిత్ రాజకీయాల్లోకి రావాలనే విషయాన్ని తప్పుబడుతూ.. మానాన్నే తమిళనాడుకు కాబోయే సీఎం అనికెమెంట్ పెట్టారు. ఈ కామెంట్ చేసింది శింబు సోదరుడు కురలరాసన్ అని అజిత్ ఫాన్స్ అంతా అతడిపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. కురలరాసన్ చేసిన వ్యాఖ్యలు అజిత్ ని అవమానించే విధంగా ఉన్నాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఫేక్ అకౌంట్

    ఫేక్ అకౌంట్

    ఈ వివాదంపై కురలరాసన్ తండ్రి టి రాజేందర్ స్పందించారు. ఆ ట్విటర్ అకౌంట్ ఫేక్ అని తేల్చేశారు. తన కుమారుడు ఎప్పుడూ ఎవరిని కించపరచడని అన్నారు. ఇలా తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని రాజేందర్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో రాజేందర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఆ కోరిక ఇప్పటిది కాదు

    ఆ కోరిక ఇప్పటిది కాదు

    ఇక అజిత్ పాలిటిక్స్ లోకి రావాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, అజిత్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఓ సందర్భంలో అజిత్ నా బిడ్డలాంటివాడు అంటూ జయ వేదికపైనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2016లో జయలలిత మరణించినప్పుడు అజిత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ బలంగా సినిపించింది. జయ రాజకీయ వారసుడు అజిత్ అని, ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరారు. కానీ అజిత్ మాత్రం తాను రాజకీయాల్లోకి రానని తేల్చేశారు.

    English summary
    Simbu's father Kuralarasan has been heavily criticised by the fans of Ajith
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X