twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీఎస్టీ, నోట్ల రద్దుపై శింబు బాంబు: మరో పాటతో వివాదంలోకి శింబు (వీడియో)

    వివాదాస్పద నటుడు, తమిళ హీరో అయిన శింబు ఇప్పుడు నోట్ల రద్దుపై పాడిన పాటతో విరుచుకు పడ్డాడు. శింబు పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    |

    Recommended Video

    మరో పాటతో వివాదంలోకి శింబు !

    ఇప్పటికే తమిళ రాజకీయాల్లో ఉన్న లుకలుకలతో సతమతమవుతున్న కోలీవుడ్ కి ఇంకో షాక్ ఇచ్చాడు శింబు. మెర్సల్ వివాదం నేపథ్యం లో తమిళ హీరోలకూ కేంద్రం అధికార పార్టీ అయిన బీజేపీ నేతలకూ మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతోంది. ఇలాంటి సందర్భం లో బీజేపీపై విమర్శలు గుప్పించే కోలీవుడ్ హీరోల జాబితాలో తాజాగా శింబు చేరాడు. పెద్ద నోట్ల రద్దుపై పాట పాడి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇప్పుడిప్ప్డే చల్లబడుతున్న వివాదం మళ్ళీ రాజుకుంది. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమిళ సినిమా ఇండస్ట్రీ యుద్దం ప్రకటించినట్టయ్యింది.

     నోట్ల రద్దుపై పాడిన పాట

    నోట్ల రద్దుపై పాడిన పాట

    ఒక పక్క కమల్ హాసన్, విశాల్, విజయ్, పార్థిబన్, ప్రకాశ్ రాజ్ లాంటి నటులంతా వరుసగా బీజేపీ ప్రభుత్వం పట్ల తమ అసంతృప్తిని ప్రకటిస్తూండగానే వివాదాస్పద నటుడు, తమిళ హీరో అయిన శింబు ఇప్పుడు నోట్ల రద్దుపై పాడిన పాటతో విరుచుకు పడ్డాడు. శింబు పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన జీఎస్టీ పేదోడి పరిస్థితిని మరింత దిగజార్చిందని శింబు తన పాటలో వివరించారు.

    మరోసారి సంచలనం

    మరోసారి సంచలనం

    శింబు గతంలో పాడిన ఓ పాట కూడా సంచలనం అయిన విషయం తెలిసిందే. అది బీప్ సాంగ్ అవడంతో మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు నోట్ల రద్దుపై పాట పాడి మరోసారి సంచలనం సృష్టించాడు శింబు. విమర్శలు గుప్పించే కోలీవుడ్ హీరోల జాబితాలో తాజాగా శింబు చేరాడు.

     శింబు పాడిన పాట

    శింబు పాడిన పాట

    పెద్ద నోట్ల రద్దుపై పాట పాడి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. శింబు పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డీమానిటైజేషన్ వల్ల పేదోడే నష్టపోయాడాని తమిళంలో శింబు పాడిన పాటకు భారీ స్పందన వస్తోంది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల వద్ద జనాల బారులు, సామాన్యుల ఇక్కట్లను పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

    లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా

    లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా

    వ్యవసాయం కోసం రుణాలు తీసుకునేందుకు రైతులు బ్యాంకులకు వస్తే అధికారులు నిర్లక్ష్యంగా వారిని మెడపట్టుకుని బయటకు గెంటేస్తారని, అదే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లాంటి వాళ్లు వస్తే వారికి బారీగా రుణాలు ఇచ్చి లండన్‌కు పంపిస్తారని శింబు పాట ద్వారా వివరించారు.

     బాలమురుగన్ మ్యూజిక్

    బాలమురుగన్ మ్యూజిక్

    పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన జీఎస్టీ పేదోడి పరిస్థితిని మరింత దిగజార్చిందని శింబు తన పాటలో వివరించారు. పాట మొదటి నుంచి చివరి వరకు ప్రజల కష్టాలను వివరించారు. ఊపుతో కొనసాగిన ఈ పాటకు బాలమురుగన్ మ్యూజిక్ అందించారు.

    బీప్ సాంగ్‌తో అపకీర్తి

    బీప్ సాంగ్‌తో అపకీర్తి మూటకట్టుకున్న శింబు ఈ సారి మాత్రం ప్రశంసలనే అందుకుంటున్నాడు. మొత్తానికి ఇప్పటికి జరుగుతున్న యుద్దం లో తానూ భాగమై ఏపక్కన తన స్టాండ్ ఉందో చెప్పేసాడు. ఎంతయినా తమిళ హీరోలు ఉన్నంత యాక్టివ్ గా సామాజికాంశాలమీద మన హీరోలు ఉండరేమిటన్న ఆలోచనలు కూడా తెప్పించేసాడు ఇప్పటికే ఈ పాటని పోస్ట్ చేస్తూ... టాలీవుడ్, బాలీవుడ్ హీరోలని ప్రశ్నిస్తున్నారు జనాలు.

    English summary
    Simbu's Demonetization Anthem touches upon various serious political issues of the country, from demonetisation to GST. It takes on corporate honchos and people in the position of power, including Prime Minister Narendra Modi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X