»   »  ‘త్రిష ఇలియానా నయనతార’లో సిమ్రాన్

‘త్రిష ఇలియానా నయనతార’లో సిమ్రాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యువ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘త్రిష ఇలియాన నయనతార'. ఆనంది హీరోయిన్. సరికొత్త టైటిల్, సరికొత్త కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుంది.

 Simran’s cameo in 'Trisha Ileana Nayanthara'

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటివలే దర్శకుడు ఆమెను కలిసి కథను వినిపించగా... సిమ్రాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా మార్చి రెండవ వారం నుండి సిమ్రాన్ షూటింగులో జాయిన్ అవుతుందని సమాచారం.

హీరోయిన్ అవకాశాలు దగ్గిన తర్వాత సిమ్రాన్ ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. అయితే అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలు మాత్రం చేస్తున్నారు. గత ఏడాది ‘ఆహా కళ్యాణం' సినిమాలో సిమ్రాన్ అతిధి పాత్రలో నటించింది. అయితే‘త్రిష ఇలియాన నయనతార'లో ఆమె పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుందట.

English summary
Music director turned actor GV Prakash is currently busy with his upcoming movie titled as ‘Trisha Ileana Nayanthara’. The movie is progressing at brisk pace. The latest buzz is that yesteryear heroine Simran is playing a special role in this movie
Please Wait while comments are loading...