»   » ఆమె చీత్కరించిన పాత్రలో సిమ్రన్ , పాపం మరీ ఇలాంటి పాత్రలోనా

ఆమె చీత్కరించిన పాత్రలో సిమ్రన్ , పాపం మరీ ఇలాంటి పాత్రలోనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ దర్శకుడు సెల్వ తెరకెక్కిస్తోన్న ఒక సినిమాలో సిమ్రాన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందనే వార్త ఇటీవల వినిపించింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ప్రియమణిని అడిగారట. ఈ సినిమాలో అరవింద్ స్వామి కథానాయకుడిగా నటిస్తున్నాడు. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు అరవింద్ స్వామి. అతడి చేతి నిండాసినిమాలున్నాయి. ఇటు విలన్ గా ఆటు హీరోగా నటిస్తున్నాడితను.

అరవింద్ సరసన ప్రముఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక సినిమాలో త్రిష ఆయన సరసన నటిస్తోంది. ఆయన స్నేహితురాలైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ప్రియమణిని సంప్రదించారట. 'పరుత్తివీరన్‌' చిత్రం ప్రియమణికి జాతీయ పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత తమిళంలో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. మలైకోట్టె, రావణన్‌, చారులత వంటి చిత్రాలలో నటించిన ప్రియమణి తెలుగు, కన్నడ వంటి ఇతర భాషా చిత్రాలలోనూ నటిస్తూ వచ్చింది.

Simran's cop act in Arvind Swami's next

ఇప్పుడు మలయాళం చిత్రాలలో మాత్రమే నటిస్తోంది. ఈ నేపథ్యంలో సెల్వ దర్శకత్వంలో అరవింద్‌ స్వామి నటిస్తున్న చిత్రంలో ఆయనకు స్నేహితురాలిగా నటించే అవకాశం ప్రియమణికి వచ్చింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ప్రియమణి... స్నేహితురాలి పాత్ర అనడంతో పెద్దగా రెస్పాన్స్‌ కాలేదట.

స్నేహితురాలి పాత్ర అని చెప్పగానే .. కుదరదంటూ ఆ ఆఫర్ ను ప్రియమణి సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. దాంతో సిమ్రాన్ ను అడగగా ఆమె ఓకే చెప్పేసిందని చెబుతున్నారు. అలా ప్రియమణి కోసం అనుకున్న పాత్రను సిమ్రాన్ చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోన్న సిమ్రాన్ కి ఈ పాత్ర ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.

కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన నటించిన సిమ్రన్‌ వివాహం తరువాత సినిమాలకి దూరంగా వుంది. ఆ తర్వాత మళ్లీ నటన పట్ల ఆసక్తిని చూపింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో టీవీ షోలలో పాల్గొంది. కాగా, ఆమె అరవింద్‌ స్వామితో కలిసి నటించడానికి అంగీకరించింది.

English summary
Buzz is that Simran has been assigned to do an important role in the film. She plays a tough cop in the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu