»   » జూ ఎన్టీఆర్ మీద స్టార్ డైరెక్టర్ చెత్త కామెంట్స్, పబ్లిసిటీ కోసమేనా?

జూ ఎన్టీఆర్ మీద స్టార్ డైరెక్టర్ చెత్త కామెంట్స్, పబ్లిసిటీ కోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ జూ ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా సౌత్ లో...? కానీ ఓ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ మీద సంచలన కామెంట్స్ చేసాడు. అసలు తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదని, అతని పేరు ఎప్పుడూ వినలేదని, అతన్ని ఎప్పుడూ కలవలేదు అంటూ కామెంట్ష్ చేసాడ.

  తాత ఎన్టీఆర్ వారసత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 సంవత్సరాలవుతోంది. వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా... నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుని స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర సౌత్ రాష్ట్రాల్లోనూ తరచూ విడుదలవుతుంటాయి. ఎన్టీఆర్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో(శాటిలైట్) నూ డబ్ అవుతూ మంచి టీఆర్పీ రేటింగును సంపాదిస్తున్నాయి.

  మరి అలాంటి హ్యూజ్ స్టార్ ఎన్టీఆర్ తెలియదు అని ఆ స్టార్ డైరెక్టర్ అనడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు... సింగం-3 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న తమిళ దర్శకడు హరి.

  ఇంటర్వ్యూలో

  ఇంటర్వ్యూలో

  సింగం-3 సినిమా ప్రమోషన్లో భాగంగా హరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... మీరు తెలుగు ఎన్టీఆర్ తో చేసే అవకాశం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరి అతను ఎవరో నాకు తెలియదు అంటూ కామెంట్ చేసారు.

  పబ్లిసిటీ కోసమేనా?

  పబ్లిసిటీ కోసమేనా?

  హరి దర్శకత్వం వహించిన సింగం, సింగం 2 తెలుగులో విడుదలయ్యాయి. కానీ హీరో సూర్యకే గుర్తింపు దక్కింది తప్ప... చాలా మంది తెలుగు వారికి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే విషయం తెలియదు. తన పేరు తెలుగు మీడియాలో మార్మోగాలనే ఉద్దేశ్యంతోనే ఈ కాంట్రవర్సల్ కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది.

  సింగం 3

  సింగం 3

  సింగం 3 చిత్రాన్ని తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు.

  ఆడియో రిలీజ్ డేట్

  ఆడియో రిలీజ్ డేట్

  ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ సూర్య కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆడియోను డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని తెలిపారు.

  అంచనాలు భారీగా

  అంచనాలు భారీగా

  రోజు రోజుకు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగిన విధంగానే చిత్రం సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలవబోతుందని నిర్మాత శివకుమార్ అన్నారు.

  సూర్య నట విశ్వరూపం

  సూర్య నట విశ్వరూపం

  ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి అన్నారు.

  rn

  రిలీజ్ డేట్

  డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.

  షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు

  షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు

  షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  During the promotions of his upcoming action entertainer S3, when Hari was asked if he was contemplating to direct NTR in his next project, Hari has reportedly said that he didn't know NTR and he heard the name for the first time. 'I have never met him until now,' Hari allegedly said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more