For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసలు నటించింది నేనేనా ?: రజనీ డౌట్

  By Srikanya
  |

  చెన్నై :''పదిహేను రోజుల క్రితం 'శివాజీ' సినిమా చూడమని చెప్పారు. ఇందులోని 'వాజీ.. వాజీ..' పాట చూశాను. నాకే ఆశ్చర్యమేసింది. అసలు నటించింది నేనేనా అనుకొన్నాను. నిజం చెప్పాలంటే ఇది నా అభిమానులకు పెద్ద విందుగా ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సెప్టెంబరులో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి''అన్నారు. త్వరలో తెరపైకి రానున్న శివాజీ 3డీ వివరాలు వెల్లడించేందుకు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటైంది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలుకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్. ఆ సినిమాలు ఎన్ని సార్లు రిపీట్ రిలీజ్ లు ఉన్నా జనం ఎగబడి చూస్తారు. అలాంటిది ఆ సినిమాని త్రీడి కి కన్వర్ట్ చేసి వదిలితే భాక్సాఫీస్ బ్రద్దలు అవుతుంది. ఇప్పుడిదే కమర్షియల్ ఫార్ములతో రనజీకాంత్ సూపర్ హిట్ చిత్రం శివాజీని మారుస్తున్నారు. 'సింహం సింగిల్‌గా వస్తుంది'.. అంటూ 'శివాజి' చిత్రంలో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్‌. శంకర్‌ దర్శకత్వంలో 2007లో వచ్చిందీ చిత్రం. ఏవీఎమ్‌ సంస్థ నిర్మించింది. రజనీ సరసన శ్రియ నటించింది. త్వరలో 'శివాజి'ని 3డీలో చూపించబోతున్నారు.

  శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం 'శివాజీ'. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఏవీయమ్‌ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమాకి 3డీ సొబగులు అద్దుతున్నారు. గతేడాది నుంచి ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే త్రీడీ సినిమా కోసం నిడివి తగ్గించాల్సి వస్తోంది. కథాగమనం దెబ్బతినకుండా కొన్ని సన్నివేశాలను
  తొలగించడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఇక ఈ చిత్రం 185 నిమిషాలపాటు సాగుతూంటే యాక్షన్ ఎంటర్టైనర్. ప్రస్తుతం త్రీడి వెర్షన్ కోసం 137 నిమిషాలకు కుదిస్తున్నారు. అంటే 48 నిమిషాల నిడివి గల సన్నివేశాలకు కత్తెర్లు పడతాయన్నమాట. 2డీ పరిజ్ఞానంతో చిత్రించిన ఈ సినిమాను ఇప్పుడు త్రీడీలోకి మారుస్తున్నారు. చెన్నైలోని ప్రసాద్‌ ఈఎఫ్‌ఎక్స్‌లో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి.

  ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న 'కోచ్చడయాన్‌' శరవేగంగా సాగుతోంది. శివాజీ 3డీ విడుదలైన తరువాత 'కోచ్చడయాన్‌' జనం ముందుకొస్తుంది. 'కోచ్చడయాన్‌'త్రీడీ సినిమాయే. ఇది డిసెంబరులో విడుదలవుతుంది.తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న 'కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్‌కి 'విక్రమసింహా' అనే పేరును ఖరారు చేశారనేది విశ్వసనీయ సమాచారం. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

  English summary
  
 Rajni says...“I was wondering how I would pay my fans back because I am here because of them. Without my knowledge, AVM Productions has brought this 3D version of Sivaji and they informed me only 15 days later. This is the biggest gift I can offer my fans”.Rajanikanth's 2007 blockbuster, directed by Shankar, is being converted into 3D by the production house AVM.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X