»   » పవన్ కల్యాణ్ దారిలో తమిళ హీరో.. వారిని మోసం చేయను..

పవన్ కల్యాణ్ దారిలో తమిళ హీరో.. వారిని మోసం చేయను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో విలక్షణ నటుల్లో ఒకరైన నటుడు శివకార్తీకేయన్ ఓ మంచి నిర్ణయాన్ని తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతున్నది. కమెడియన్ నుంచి హీరోగా మారిన శివకార్తీకేయన్ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. శివతో కలిసి పనిచేసేందుకు పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. హీరోగా మంచి క్రేజ్ రావడంతో పలు ఉత్పత్తుల కంపెనీలు తమ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనే ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఈ నేపథ్యంలో ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

కూల్ డ్రింక్స్ తాగను..

కూల్ డ్రింక్స్ తాగను..

ఇటీవల మీడియాతో శివకార్తీకేయన్ మాట్లాడుతూ.. నేను కూల్ డ్రింక్స్, ప్యాక్ డ్రింక్స్ తాగడం మానేశాను. ఇప్పటికీ 8 ఏళ్లు కావోస్తున్నది. అది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే అని అన్నారు.

ఆరోగ్యానికి హానికరం

ఆరోగ్యానికి హానికరం

ప్యాక్డ్ ఫుడ్ ఆరోగ్యానికి హానీకరం. అలాంటి ఆహారం నా శరీరానికి సరిపడదు. అదే విషయాన్ని వేలాక్కైరన్ చిత్రంలో చెప్పాల్సి వచ్చినప్పడు చాలా ఎక్సైట్ అయ్యాను అని ఆయన వెల్లడించారు.

నా కూతురు కూడా..

నా కూతురు కూడా..

నాకు 4.5 ఏళ్ల కూతురు ఉంది. నా చిన్నారి బర్గర్, పానిని, పిజా లాంటి ఆహార పదార్థాలను తినదు. నాలాగే నా కూతురు కూడా కూల్ డ్రింక్స్ తాగదు. అందుకే నేను వ్యాపార ప్రకటనల్లో నటించకూడదు అని నిర్ణయించుకొన్నాను అని శివకార్తీకేయన్ తెలిపారు.

చిన్నారులకు హాని

చిన్నారులకు హాని

శివకార్తీకేయన్ క్రేజ్‌ను పలు కంపెనీలు లాభంగా మలుచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో... చిన్నారులకు హానీ కలిగించే కూల్ డ్రింక్స్‌కు ప్రచారం చేయను. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించను అని స్పష్టం చేశారు.

 ఎందుకు ప్రచారం చేయాలి

ఎందుకు ప్రచారం చేయాలి

నేను తినకుండా, తాగకుండా ఏ వస్తువుకైనా ప్రచారం చేయడం సరికాదు. అలా చేస్తే ప్రజలను, పిల్లలను మోసం చేయడమే అవుతుంది. నా కూతురు కూడా తాగనపుడు నేను ఎందుకు ప్రచారం చేయాలి అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 పవన్ కల్యాణ్ కూడా ఇలానే

పవన్ కల్యాణ్ కూడా ఇలానే

శివకార్తీకేయన్ నిర్ణయాన్ని పరిశీలిస్తే.. పవన్ కల్యాణ్ కూడా కొన్నేళ్ల క్రితం ఇలాంటి నిర్ణయాన్నే తీసుకొన్నాడు. తొలుత పెప్సీ యాడ్‌లో నటించారు. ఆ తర్వాత పవన్ వ్యాపార ప్రకటనల్లో నటించకూడదని నిర్ణయం తీసుకొన్నారు. ఓ సందర్భంలో తన లాభాపేక్ష కోసం పిల్లలు, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టనని పవన్ స్పష్టం చేశారు.

English summary
Sivakarthikeyan has become one of the leading heroes of Tamil cinema, in a short span of time. From being a stand-up comedian to becoming a star in K'town, the career graph of Siva is astounding. In a recent interaction, he explained why he doesn't act in commercial ads of soft drinks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu