అన్న ఎప్పటికీ అన్నే... Thalapathy ట్యాగ్‌పై తేల్చేసిన స్టార్ హీరో

దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా తన స్టైల్, యాక్షన్, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించారు విజయ్. అభిమానుల చేత ఇళయ దళపతి, దళపతిగా నీరాజనాలు అందుకుంటున్నారు. తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు విజయ్. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు విజయ్.

మహానాడుతో వణికించిన విజయ్
ఇటీవల మధురైలో టీవీకే రెండో మహానాడును విజయవంతంగా నిర్ణయించి తమిళ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, ఏఐడీఎంకేలను వణికించారు దళపతి. మధురైలో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు ఏకంగా 10 లక్షల మందికి పైగా విజయ్ అభిమానులు, టీవీకే కేడర్ తరలి వచ్చింది. తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని 2026లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు విజయ్. ఇదే సమయంలో బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకేలపై ఆయన విరుచుకుపడ్డారు. మధురై బహిరంగసభతో తమిళనాడులో ప్రకంపనలు సృష్టించారు విజయ్. దీంతో ఆయనపై ఆయా పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నాయి.

Sivakarthikeyan reacts to Next Thalapathy Tag at Madharaasi Trailer Launch

జననాయగన్‌తో సినిమాలకు గుడ్‌బై
రాజకీయాలను పక్కనపెడితే సినిమాల పరంగా తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు దళపతి. తమిళనాడులోని అన్ని వర్గాల్లో, కులాల్లో, రాజకీయ పార్టీల్లో విజయ్‌కి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తన 69వ సినిమా జననాయగన్‌లో నటిస్తున్నారు విజయ్. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్నందున జననాయగన్ తన చివరి చిత్రమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో జననాయగన్‌పై దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నెక్ట్స్ దళపతి ఎవరు?
విజయ్ రాజకీయాల్లో బిజీ కానుండటంతో తదుపరి దళపతి ఎవరనే చర్చ కోలీవుడ్‌లో కొనసాగుతోంది. విజయ్ సమకాలీనులు అజిత్, సూర్య, విక్రమ్‌ల శకం కూడా త్వరలో ముగియనుంది. దీంతో వారు తదుపరి దళపతిగా నిలిచే అవకాశాలు తక్కువే. పైగా వారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాంతో అందరి చూపు యువనటులు ధనుష్, శివకార్తీకేయన్‌లపైనే నెలకొంది. వీరిద్దరూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధిస్తున్నారు. ధనుష్‌కు క్లాస్ వర్గాల్లో ఫాలోయింగ్ ఉండగా.. శివకార్తీకేయన్‌కు యువతలో బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో శివకార్తీకేయన్‌ను ఫ్యూచర్ దళపతి, నెక్ట్స్ దళపతి, కుట్టి దళపతి అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు. తాజాగా వీటికి చెక్ పెట్టారు శివకార్తీకేయన్.

మదరాసితో శివకార్తీకేయన్
ఏర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం మదరాసి. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌‌‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ సినిమాను 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్ 5న మదరాసి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అన్న ఎప్పుడూ అన్నే
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆగస్ట్ 24న చెన్నైలో మదరాసి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తనను ఫ్యూచర్ దళపతి అని పిలుస్తుండటంపై శివకార్తీకేయన్ స్పందించారు. అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడేనని తేల్చేశారు. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. కొందరి అభిమానాన్ని పొందగలిగానని, ఏ నటుడూ మరో స్టార్ ఫ్యాన్స్‌ని గెలవాలని అనుకోరని శివకార్తీకేయన్ తేల్చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌పై ఆవేశపడొద్దని ఆయన తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం శివకార్తీకేయన్ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X