»   »  స్నేహ, శ్రియ అత్తాకోడళ్లు !

స్నేహ, శ్రియ అత్తాకోడళ్లు !

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sarath Kumar
తండ్రీకొడుకులుగా శరత్ కుమార్ ద్వి పాత్రాభినయం చేస్తన్నఓ తమిళ సినిమాలో ఈ విచిత్రం కనపడబోతోంది. స్నేహ, శ్రియ ఇద్దరూ శరత్ కుమార్ రెండు పాత్రలకు జోడీగా నటిస్తున్నారు. కమలహాసన్‌తో 'దశావతారం'ను రూపొందించిన దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. మొదట ఈ సినిమాలో కొడుకు శరత్‌కుమార్ పాత్ర సరసన శ్రియను ఎంపిక చేశారు. తరువాత తండ్రి పాత్ర సరసన నటించేందుకు స్నేహ ని అడిగారు. మొదట ఆమె ఈ విషయం తెలిసి అత్త పాత్రకు అంగీకరించ లేదు. కాని ఆ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా వుండటంతో ఆమె ఒప్పుకుంది. దాంతో కధ ప్రకారం స్నేహ, శ్రియ అత్తాకోడళ్లుగా కనిపించటం సాద్యమవబోతోంది. స్నేహ పాత్ర సెకండాఫ్ లో ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. అంటే శ్రియ,స్నేహ కలిసి కనిపించే అవకాశాలు లేవు. అందువల్లే ఆ పాత్రని చేయడానికి స్నేహ అంగీకరించిందని ఆమె శ్రేయాభిలాషులు చెపుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X