»   » భర్తకు కిడ్నీ ఆపరేషన్: విడాకుల దిశగా రజనీకాంత్ కూతురు?

భర్తకు కిడ్నీ ఆపరేషన్: విడాకుల దిశగా రజనీకాంత్ కూతురు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం చెన్నైకి చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో ఆరేళ్ల క్రితం ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సౌందర్య కాపురం గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఆమె విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

వివాహం అయిన కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయంట. దాదాపు సంవత్సరం నుండి ఆమె భర్తకు దూరంగానే ఉంటోందని, తాజాగా ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ సౌందర్య పిటిషన్ దాఖలు చేసినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఆమె భర్త అశ్విన్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటున్నారని, అందులో భాగంగా ప్రస్తుతం అశ్విన్ అమెరికాలో ఉన్నాడని టాక్.

జాతీయ మీడియాలో కూడా...

జాతీయ మీడియాలో కూడా...

ఇదేదో గాసిప్ వార్త అనుకుంటే పొరపాటే. జాతీయ మీడియాలో సైతం ఈ మేరకు ప్రశ్నార్థకంతో కూడిన వార్తలు పబ్లిష్ అయ్యాయి. దీనిపై స్పందించడానికి రజనీకాంత్ కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రావడం లేదు.

అశ్విన్ ఆరోగ్య పరిస్థితి

అశ్విన్ ఆరోగ్య పరిస్థితి

భర్తతో కొంతకాలంగా సంబంధాలు సరిగా లేక పోవడానికి తోడు.... అశ్విన్ కిడ్నీ మార్పిడి చికిత్స కూడా సౌందర్య ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అతడు యూఎస్ నుండి రాగానే...

అతడు యూఎస్ నుండి రాగానే...

అశ్విన్ యూఎస్ఏ నుండి తిరిగి రాగానే ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు పొందుతారని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సౌందర్య పెళ్లి జరిగిన ఆరేళ్లలోనే పెటాకులు కావడం రజనీ అభిమానులను బాధిస్తోంది.

రజనీ సినిమాపై ఫోకస్ పెట్టిన సౌందర్య

రజనీ సినిమాపై ఫోకస్ పెట్టిన సౌందర్య

రజనీకాంత్ జీవితాన్ని సినిమాగా తీస్తే? ఆయన గురించి ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని రహస్యాలు సినిమా ద్వారా బయట పెడితే? ఆ సినిమాకు ఎంత క్రేజ్ వస్తుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. త్వరలోనే రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈ బాధ్యతను తీసుకునేది మరెవరో కాదు.. స్వయంగా ఆయన ఇద్దరు కూతుళ్లే.

ఇద్దరు కూతుళ్లు కలిసి

ఇద్దరు కూతుళ్లు కలిసి

రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు కలిసి తన తండ్రి జీవితాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు.

అధికారిక ప్రకటన

అధికారిక ప్రకటన

ఈ విషయమై సౌందర్య స్పందిస్తూ..‘నిజమే.. నాన్నగారి జీవితం మీద సినిమా తీయాలనుకుంటున్నాం. నా సోదరి ఐశ్వర్య నాన్నగారి జీవితం మీద బుక్ రాస్తోంది. నాన్నగారి జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి' అన్నారు.

చాలా తెలియని విషయాలు

చాలా తెలియని విషయాలు

రజనీకాంత్ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రంపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఈ సినిమాలో అభిమానులు చూడబోతున్నారు.

కొన్ని సంఘటనలు

కొన్ని సంఘటనలు

నాన్నగారి జీవితంలోని కొన్ని సంఘటనలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. సినిమాలో మేము వాటిని చూపించబోతున్నాం. నేను ఆయన కూతుర్ని మాత్రమే కాదు..ఆయనకు పెద్ద అభిమానిని కూడా, ఆయన సినిమా తెరపై చూడటం అంటే నాకు చాలా ఇష్టం. అభిమానులంతా ఆయన జీవితాన్ని సినిమాగా చూడటాన్ని ఇష్టపడతారు అని సౌందర్య తెలిపారు.

వివాదాలు, ఎలాంటి కల్పితాలు లేకుండా

వివాదాలు, ఎలాంటి కల్పితాలు లేకుండా

రజనీకాంత్ స్టార్ గా ఎదిగిన తర్వాత కొన్ని వివాదాలు కూడా ఆయన్ను చుట్టు ముట్టాయి. అవన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు. సినిమాలో ఎలాంటి కల్పితాలకు చోటు లేకుండా పూర్తిగా ఆయన జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చూపెట్టబోతున్నారు.

రజనీ నటిస్తారా, దర్శకత్వం ఎవరు

రజనీ నటిస్తారా, దర్శకత్వం ఎవరు

రజనీకాంత్ కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రజనీకాంతే నటిస్తారా? లేక మరెవరైనా నటుడు ఈ చిత్రంలో రజనీకాంత్ గా నటించబోతున్నాడా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

English summary
If reports are to be believed, superstar Rajinikanth’s daughter Soundarya has decided to end her marriage of six years to Chennai-based industrialist Ashwin Ramkumar. According to news reports, the couple has moved the family court seeking divorce by mutual consent.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu