»   » యాక్సిడెంట్ చేసిన రజనీకాంత్ కూతురు, కేసు కాకుండా సెటిల్మెంట్!

యాక్సిడెంట్ చేసిన రజనీకాంత్ కూతురు, కేసు కాకుండా సెటిల్మెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య యాక్సిడెంట్ కి కారణం అయ్యారు. ఆమె కారు డ్రైవ్ చేసుకుని వెలుతుండగా రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోను ఆమె కారు ఢీ కొట్టింది. చెన్నైలోని ఆళ్వార్‌పేట్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

తన ఆటోను ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్ రోడ్డుమీదే గొడవకు దిగారు. పోలీస్ కేసు పెడతానంటూ హడావుడి చేసాడు. రజనీకాంత్ కూతురు కావడంతో అప్పటికే అక్కడ భారీగా జనం గుమిగూడారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిపోయిన సౌందర్య విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళితే మీడియాలో పెద్ద రచ్చ అవుతుందని భయపడి హీరో ధనుష్‌కు ఫోన్ చేసింది.

 అక్కడే సెటిల్మెంట్

అక్కడే సెటిల్మెంట్

హీరో ధనుష్ వెంటనే రంగంలోకి దిగి ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడారు. అతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా అక్కడే సెటిల్మెంట్ చేసాడు. ఆటో రిపేరుకు ఎంత ఖర్చయితే అంత డబ్బివ్వడంతో పాటు తగిన పరిహారం ఇప్పిస్తానని ఈ వివాదాన్ని సెట్ చేసాడట.

కంగారుపడ్డ రజనీకాంత్

కంగారుపడ్డ రజనీకాంత్

రజనీకాంత్ ఈ విషయం తెలిసి తొలుత కాస్త కంగారు పడినా.... ధనుష్ ఏ గొడవ కాకుండా చేసాడనే విషయం తెలసుకుని కూల్ అయ్యాడట. ఇకపై డ్రైవర్ లేకుండా కారును ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లవద్దని సౌందర్యకు సూచించారట.

 సౌందర్య, ధనుష్ కలిసి

సౌందర్య, ధనుష్ కలిసి

ప్రస్తుతం సౌందర్య దర్శకత్వ శాఖలో తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ధనుష్ హీరోగా ఆమె ‘విఐపి-2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈచిత్రంలో ప్రముఖ బాలీవుడ్ బాలీవుడ్ నటి కాజోల్ విలన్ గా నటిస్తోంది.

ప్రపంచానికి తెలియని రజనీకాంత్ రహస్యాలు: కూతుళ్లే బయట పెట్టబోతున్నారు!

ప్రపంచానికి తెలియని రజనీకాంత్ రహస్యాలు: కూతుళ్లే బయట పెట్టబోతున్నారు!

ప్రపంచానికి తెలియని రజనీకాంత్ రహస్యాలు: కూతుళ్లే బయట పెట్టబోతున్నారు. మీరు విన్నది నిజమే. త్వరలో వారు రజనీకాంత్ జీవితంపై సినిమా చేయబోతున్నారు. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Soundarya Rajinikanth was involved in a minor car accident on Tuesday, February 28, when the car she was travelling in hit an auto in Alwarpet, Chennai. The issue was settled before a case was to be registered at the nearby police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu