»   » ఆ హీరో కోసం బుర్ఖాలో శ్రీదేవి.. ఇళయరాజా చెప్పిన విషయమేమింటే..

ఆ హీరో కోసం బుర్ఖాలో శ్రీదేవి.. ఇళయరాజా చెప్పిన విషయమేమింటే..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఎలాంటి దయ, కనికరం లేకుండా అందాల తార శ్రీదేవి అభిమానులను, సహనటులు, స్నేహితులను, సన్నిహితులను వదలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణాన్ని పరిశ్రమ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ సందర్భంగా ఆమెతో ముడిపడి ఉన్న మధురస్మృతులను గుర్తు చేసుకొంటున్నారు. విలక్షణ నటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌తో తాను నటించిన సినిమాను చూడటానికి శ్రీదేవి బుర్ఖా ధరించి వెళ్లిందట. ఆ విషయం మీ కోసం..

  థియేటర్‌లో సినిమా చూడటం

  థియేటర్‌లో సినిమా చూడటం

  కొన్నేళ్ల క్రితం మీడియాకు శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సాధారణంగా ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడటం వీలుకాదు. థియేటర్‌లో మేమున్నామంటే గందరగోళంగా ఉంటుంది. అందుకే థియేటర్‌కు వెళ్లి చూడటం కుదరదు.

   కమల్‌హాసన్, రజనీ నటించిన

  కమల్‌హాసన్, రజనీ నటించిన

  అప్పట్లో కమల్‌హాసన్, రజనీ, నేను నటించిన మూంద్రు ముడిచు అనే సినిమా రిలీజైంది. స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరుకాలేకపోయాను. దాంతో థియేటర్‌లో చూడాలని అనుకొన్నాను. ప్రేక్షకులు గుర్తుపట్టకుండా ఉండటానికి నేను బుర్ఖా ధరించి సినిమాకు వెళ్లాను అని చెప్పారు.

   బుర్ఖా ధరించినా భయమే

  బుర్ఖా ధరించినా భయమే

  బుర్ఖా ధరించినప్పటికీ నాలో భయంగానే ఉంది. ఒకవేళ శ్రీదేవి అని గుర్తుపడితే ఎదురయ్యే పరిస్థితిని ఊహించుకొంటేనే కష్టంగా ఉండేది. భయపడుతూనే ఆ సినిమా చూశాను అని శ్రీదేవి వెల్లడించింది.

  శ్రీదేవి గురించి ఇళయరాజా

  శ్రీదేవి గురించి ఇళయరాజా

  శ్రీదేవితో పనిచేసిన నాటి విషయాలను తాజాగా సంగీత దర్శకుడు ఇళయరాజా గుర్తు చేసుకొన్నారు. మూంద్రమ్ పిరై చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో వసంతకోకిల, హిందీలో సద్మాగా రీమేక్ అయింది.

  శ్రీదేవి బాలనటిగానే పరిచయం

  శ్రీదేవి బాలనటిగానే పరిచయం

  మూంద్రమ్ పిరై సినిమా నిర్మాణ సమయంలో శ్రీదేవి, కమల్‌హాసన్ నా స్టూడియోకు వచ్చారు. వారిపై చిత్రీకరించే పాట గురించి నాతో మాట్లాడారు. బాలనటిగా శ్రీదేవి నాకు పరిచయం. ఆ సందర్భంగా శ్రీదేవి చూపిన శ్రద్ధ చూసి ఆమె ప్రతిభాపాటవాలు మరోసారి నాకు అర్థమయ్యాయి.

  బాలూ మహేంద్ర క్లిష్టంగా రాసిన

  బాలూ మహేంద్ర క్లిష్టంగా రాసిన

  బాలూమహేంద్ర క్లిష్టంగా రాసిన పదాలను నేర్చుకొని అక్కడే వారు తమదైన శైలిలో చెప్పడం నన్ను బాగా ఆకట్టుకొన్నది అని ఇళయరాజా అన్నారు.

   బాలచందర్ ఆమె ప్రతిభను

  బాలచందర్ ఆమె ప్రతిభను

  శ్రీదేవిలో ఉన్న ప్రతిభను పసిగట్టిన వారిలో బాలచందర్, బాలూ మహేంద్ర లాంటి దర్శకులు ఉన్నారు. ఆమె టాలెంట్‌కు వారు సానపట్టారు. అందుకే ఆమె అద్భుతమైన నటిగా రూపుదిద్దుకున్నది అని ఇళయరాజా చెప్పారు.

  English summary
  Here's an interesting anecdote from Sridevi's life that most people might not have been aware of. In an interview many years ago, to a magazine, the actress revealed that she had once gone to watch a Kamal Haasan film in a theatre, wearing a burkha. The Sadma actress said that she seldom went to theatres to watch films because she was wary of the public attention her appearance would bring.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more