twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పటి వరకు పవర్‌స్టార్‌పై తొమ్మిది కేసులు

    By Srikanya
    |

    Srinivasan
    చెన్నై : తమిళ హీరో పవర్‌స్టార్‌ శ్రీనివాసన్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌కు మరో ఫిర్యాదు అందింది. తిరుమంగళం కామరాజవీధికి చెందిన రవీంద్రకుమార్‌(42) పూందమల్లి సమీపంలోని శ్రీసాయిటెక్‌ రిఫ్రిజరేషన్‌ ప్రై.లిమిటెడ్‌ ఎండీ. తన వ్యాపార అభివృద్ధికి రుణం కోసం అన్నానగర్‌కు చెందిన సుదర్శనం అనే దళారీని సంప్రదించాడు.

    ఆయన పవర్‌స్టార్‌ రెండో భార్య దుర్యా నడుపుతున్న బాలాజీ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌, బాబా ట్రేడింగ్‌ కంపెనీలకు తీసుకెళ్లాడు. రూ.2.5లక్షల చొప్పున మూడు దఫాలుగా కమీషన్‌ ఇస్తే ఆరు శాతం వడ్డీతో రూ.5 కోట్లు ఇప్పిస్తానని చెప్పింది.

    ఆ మేరకు మార్చి 16కల్లా రూ.7.5 లక్షల కమీషన్‌ను రవీంద్రకుమార్‌ ఇచ్చాడు. రుణం ఇప్పించకపోవడంతో పలుమార్లు నేరుగా వెళ్లి సంప్రదించాడు. అదే సమయంలో రెండు కంపెనీల బోర్డు తిప్పేశాయి.

    తన నుంచి తీసుకున్న కమీషన్‌ డబ్బులు ఇవ్వాలని కోరగా హతమారుస్తామంటూ బెదిరించారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పవర్‌స్టార్‌పై తొమ్మిది కేసులు నమోదయ్యాయి.

    English summary
    As film comedian-' Power Star' Srinivasan languishes in prison , complaints of cheating are pouring in against him . Ravindar kumar of Thirumangalam on Thursday lodged a complaint with police commissioner S George , alleging that the actor had taken 7.5 lakh after promising him a 7 crore loan to expand his business . On Tuesday, Kannurbased jeweller Devadasan and Hosur-based businessman Chenna Krishna lodged complaints against the actor. His landlord, too, met the city police chief with complaint against the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X