»   »  యూనిట్ సభ్యులకు బంగారు నాణాలు... 200 మందికి పంచిన హీరో

యూనిట్ సభ్యులకు బంగారు నాణాలు... 200 మందికి పంచిన హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మద్య కొంత మంది స్టార్ హీరోలు తమ సినిమా కోసం కష్టపడ్డ దర్శకులకు, సంగీతం అందించిన వారికి ఇతర టెక్నీషియన్స్ గొప్ప గొప్ప బహుమతులు అందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు లో ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్ లాంటి హీరోలు ఇలాంటి బహుమతులు అందించిన విషయం తెలిసిందే.

త‌న సినిమా యూనిట్ స‌భ్యుల‌కు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వ‌డం కోలీవుడ్ హీరో విజ‌య్ కు ఉన్న అల‌వాటు. గ‌తంలో పులి సినిమా సంద‌ర్భంగా 265 మంది యూనిట్ స‌భ్యుల‌కు బంగారు నాణేలు గిఫ్ట్‌గా ఇచ్చాడు విజ‌య్‌. అదే త‌ర‌హాలో విజ‌య్ మ‌రోసారి త‌న తాజా చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు బంగారు నాణేలు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

 Star Hero gifts Gold coins to the film's unit

తాజాగా హీరో విజయ్ తన ప్రాజెక్ట్‌ కోసం కష్టపడిన చిత్ర యూనిట్‌ సభ్యులకు బహుమతులు ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశాడట. ఈ విషయాన్ని కోలీవుడ్ ఎనలిస్ట్ రమేశ్ బాలా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మెర్‌సల్ మూవీకి పనిచేసిన 200 మంది టెక్నీషియన్స్, వర్కర్స్ ఆయన బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడని ట్వీట్ చేశాడు.

మెర్స‌ల్‌ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. ద‌ర్శ‌కుడు ఎస్ జే సూర్య ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. ఆగ‌స్టు 20 న ఈ చిత్రం ఆడియోను విడుద‌ల చేయ‌నున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 17 న ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Vijay Chandar acted Saye Diavam songs released
English summary
Tamil Superstar Ilayathalapathy Vijay has gifted gold coins to 200 members of the film’s unit.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu