Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్‌లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ ట్విస్ట్ ఇవ్వకుండా ఉంటే 'బాహుబలి'ని కొట్టేస్తారట
చెన్నై: ఇండియన్ సినిమాకు లాండ్ మార్క్ చిత్రం అన్నట్లుగా మారింది బాహుబలి. ప్రతీ పెద్ద హీరో తమ చిత్రం కలెక్షన్స్ ..బాహుబలిని దాటాలని ప్రయత్నించటం గమనిస్తున్నాం. ఈ నేపధ్యంలో తమ చిత్రం బాహుబలిని దాటేలా ఉండాలని దర్శకులు కోరుకుంటే వింతేముంది. అయితే బాహుబలిని ఢీ కొట్టాలంటే మహేష్, సూర్య రంగంలోకి దూకాల్సిందేనా...
ఇదే ఆలోచన ప్రముఖ తమిళ దర్సకుడు సుందర్ సి. కు కలిగినట్లుంది. ఆయన ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలతో ఓ భారీ బడ్జెట్ చిత్రం అదీ తమిళ,తెలుగు, హిందీ, మళయాళి భాషలను కవర్ చేసేలా తియ్యాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే తమిళ హీరో సూర్య తో మాట్లాడారని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు. అయితే మహేష్ విషయమే ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అటు వైపు కూడా తనకు సమఉజ్జీ అయిన హీరో లేనిదే సూర్య చేయనని చెప్పేసాడట.

సుమారు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమాని తమ వందో చిత్రంగా శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ నిర్మించనుండటం విశేషం. ఈ విషయాన్ని సుందర్ సి భార్య కుష్బూ ధృవీకరించారు కూడా.
'' శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ సంస్థలో సుందర్ సి ఓ భారీ సినిమా చేయనున్నారు. ఆయనెప్పుడూ ఓ మంచి సినిమాని ప్రేక్షకులకివ్వడానికే ప్రయత్నిస్తారు''అని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చిన కుష్బూ నటీనటులెవరన్నది ఇంకా ఫైనల్ కాలేదంటూ పూర్తి వివరాలతో అధికారక ప్రకటన వస్తుందన్నారు.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా '24' సినిమాతో అందర్నీ మెప్పించిన తిరు పనిచేయనున్నారని తెలుస్తోంది. 'బాహుబలి' చిత్రానికి పనిచేసిన సాబు సిరిల్, కమల్ కన్నన్ కూడా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కానున్నారు.
ఇక సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్, ఇళయరాజా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అంతవరకూ బాగానే ఉంది...కాని ప్రాజెక్టు మెటీరియలైజ్ కావాలంటే మహేష్ సీన్ లోకి రావాలి. ఆయన ఆసక్తిచూపుతారా..గతంలో ఇలాంటి చారిత్రక సబ్జెక్ట్ తో మణిరత్నం వచ్చిన విషయం గుర్తుంది కదా..అప్పుడు కూడా మెటీరియలైజ్ కాలేదు.