రజనీకాంత్ పోస్టర్ వివాదం-హిందూ సంఘాల ఆగ్రహం

రజనీకాంత్ ఓటు వేస్తున్నట్లు ఉన్న ఆ ఫోటోలో.....ఆయన వెనక ఉన్న క్యూలైన్లో హిందూ దేవుళ్లయిన వినాయకుడు, విష్ణుమూర్తి ఉన్నట్లు పోస్టర్ ఏర్పాటు చేసారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానులు.....'నువ్వు రాజకీయాల్లోకి వస్తే దేవుళ్లు కూడా వచ్చి ఓటేస్టారు' అని రాసారు.
అభిమానులు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై ఆగ్రహంగా ఉన్న పలు హిందూ సంఘాలు ముఖ్యమంత్రి జయలలితకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పలువురు మండి పడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఇపుడు ఇది హాట్ టాపిక్ అయింది.
ఈ పోస్టర్‌పై.....రాజకయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానుల కోరికపై మరి రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఆయన సినిమా విశేషాల్లోకి వెళితే....ప్రస్తుతం రజనీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రం చేస్తున్నారు. త్వరలోనే ఈఛిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











