Jailer 2 Release Date: జైలర్ 2 రిలీజ్ అప్పుడే.. లీక్ చేసిన రజనీకాంత్!

దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రం జైలర్ 2. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గతంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన జైలర్ మూవీకి సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగిబాబు, మిర్నా, ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి రజనీకాంత్ స్వయంగా వెల్లడించడం ట్రెండింగ్‌గా మారింది. సినిమా విశేషాలు, విడుదల తేదీ వివరాల్లోకి వెళితే..

జైలర్ పార్ట్ 1 సినిమాలో సౌత్ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. వారి పాత్రలకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక జైలర్ 2 సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారనే విషయం ఈ మూవీపై హైప్ పెంచేలా చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కూడా స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. ఈ వార్తతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రెండితలు అయింది.

Jailer 2 Release Date

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న జైలర్ 2 సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫిని, నిర్మల్ ఆర్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాను సమారుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ కేరళలో అడుగుపెట్టారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కేరళలో చిత్రీకరించేందుకు నెల్సన్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆయన కోచి ఎయిర్‌పోర్టులో మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. జైలర్ 2 సినిమా షూటింగ్ కోసం కేరళకు వచ్చాను. సుమారుగా 6 రోజులపాటు ఈ షూటింగ్ కొనసాగుతుంది. ఈ సినిమాను 2026 సంవత్సరం జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని రజనీకాంత్ తెలిపారు.

అలాగే తమిళనాడు రాజకీయాలు, దళపతి విజయ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రజనీకాంత్ నిరాకరించారు. త్రిచీలో విజయ్ నిర్వహించిన మనాడు సభ గురించి తన అభిప్రాయం చెప్పాలని అడిగితే.. నో కామెంట్ అంటూ జవాబును దాటవేసేందుకు ప్రయత్నించారు. అనంతరం షూటింగ్ ప్రదేశానికి ఆయన బయలుదేరి వెళ్లారు.

ఇదిలా ఉండగా, రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అంచనాల మించి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా సుమారుగా 300 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ తదితరులు నటించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. శృతిహాసన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X