»   » ఫ్యాన్స్ కు స్టార్ హీరో వార్నింగ్ లాంటి సూచన

ఫ్యాన్స్ కు స్టార్ హీరో వార్నింగ్ లాంటి సూచన

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నిన్న హీరో సూర్య తన అభిమానులును ఉద్దేశించి చేసిన ట్వీట్స్ అందరినీ ఆలోచనలో పడేసాయి. ముఖ్యంగా తమిళ హీరో సూర్య కూడా అలాంటి విషయమై ట్వీట్ చేసారు. తన అభిమానులను ఉద్దేసించి కొంచెం ఘాటుగా..వార్నింగ్ లాంటి సూచన చేసారు. ప్యాన్స్ ఒకరితో మరొకరు కొట్టుకోవద్దని,విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు. సూర్య ఏం ట్వీట్ చేసారో మీరే చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్ ఖాన్ ఏమన్నారు అంటే...

షారూఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ అభిమానులు ఆన్‌లైన్‌లో, సామాజిక నెట్ వర్కింగ్ సైట్లలలో వాగ్వాదాలకు దిగుతున్నారని తమ కోసం ఎవరూ వాదులాడుకోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్స్ ని మీరు ఇక్కడ చూడవచ్చు . షారూఖ్‌, ఆమిర్‌, తాను మంచి స్నేహితులమని దీన్ని అర్ధం చేసుకుని అభిమానులు సైతం నిదానంగా ఉండాలంటూ హితవు పలికారు.

ఈ మధ్య ఒక హీరో అభిమానులతో మరో హీరో అభిమానులు ఆన్‌లైన్‌లో గొడవలు పెట్టుకుంటున్నారని, మరికొంత మంది తమ పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ పేజీలు ప్రారంభించి వాటిలో వాగ్వాదాలకు దిగుతున్నారని వాపోయారు.

సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా 'భజరంగి భాయిజాన్‌'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌పై షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు. 'హీరోగా ఉండడం కంటే సోదరుడిగా ఉండడమే చాలా గొప్ప విషయం అని నమ్ముతున్నా. 'భాయిజాన్‌' 2015 ఈద్‌కు విడుదలవుతుంది. ఫస్ట్‌ లుక్‌ నచ్చిందా?' అంటూ షారుక్‌ ఖాన్‌ ట్విట్టర్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఫొటో పోస్ట్‌ చేశారు. ఈ లింక్‌ను సినిమా దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

Suriya’s appeal to warring fans

సల్మాన్‌పై సోదరప్రేమ చూపుతూ షారుక్‌ ట్విట్టర్‌లో ఫస్ట్‌లుక్‌పై ఇలా కామెంట్‌ చేయడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ముఖ్యంగా హీరోలు తమ సినిమాల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను ఆన్‌లైన్‌ విడుదల చేయడం సాధారణం. దాన్ని ఇతర హీరోలు షేర్‌ చేయడమూ ఇంకా సాధారణం. అదే ఒక హీరో సినిమా ఫస్ట్‌ లుక్‌ను మరో హీరో ట్విట్టర్‌లో పోస్టు చేస్తే అది వింత...అదిప్పుడు బాలీవుడ్ లో జరిగింది అంటున్నారు.

ఈ పోస్టరులో సల్మాన్‌ ముఖం మొత్తం కనిపించకుండా కేవలం గెడ్డం వరకే కనిపిస్తోంది. మెడలో ఒక చిన్న గద ఉంది. పోస్టరు విషయం పక్కనపెడితే దీన్ని షారుఖ్‌ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవలే జమ్మూకశ్మీర్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

English summary
Tamil superstar Suriya requested his fans not to resort to fan wars with other stars’ fans. Earlier today, Suriya took to his Twitter page and tweeted, “Just don’t want fans n well wishers to fight with other fans..! Spend more time on yourself,family n make them proud! hv a great day!!”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu