»   » సూర్య ‘మాస్’ టైటిల్ మార్చారు

సూర్య ‘మాస్’ టైటిల్ మార్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా తమిళంలో ‘మాస్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ ‘యు' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ ‘మాస్ ఎంగిర మాస్సిలమని'గా మార్చారు.

తమిళనాడు స్టేట్ గవర్నమెంటు నుండి సబ్సిడీ పొందాలంటే సినిమా టైటిల్ తమిళంలో ఉండాల్సిందే. ఇంగ్లీషులో ఉంటే సబ్సిడీ వర్తించదు. అందుకే ఈ సినిమా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.

 Suriya’s Masss title changed!

సూర్య హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘మాస్' చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో మేధ క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. కృష్నారెడ్డి, రవీందర్ రెడ్డి నిర్మాతలు.

ఈ చిత్రంలో సూర్య సరసన నయనతార, ప్రనీత, నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిస్కరించారు.

English summary
Suriya’s Masss completed the censor formalities and it received clean ‘U’ certificate from the censor board officials. The latest update is that the title of this movie has been changed and renamed as ‘Mass Engira Massilamani’ to get tax exemption.
Please Wait while comments are loading...