»   »  సూర్య 'మేము' ఛోటా భీమ్ సాంగ్ (వీడియో)

సూర్య 'మేము' ఛోటా భీమ్ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'పసంగ-2' (తెలుగులో మేము). త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడటంతో ఈ సందర్బంగా ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. అందులో భాగంగా పిల్లలను ఆకట్టుకోవటానికి ఛీటాభీమ్ సాంగ్ వీడియోని వదిలారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ చిత్రంలో సూర్య సరసన అమలాపాల్‌ నటిస్తోంది. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'మేము' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Surya's Pasanga 2 - Chota Bheema Video

ఈ చిత్రాన్ని తెలుగులో సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తుండగా.. సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి సహ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాూ శరవేగంగా పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తమిళ`తెలుగు భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా మార్కెట్‌ కలిగిన సూర్య నటిస్తూ.. తమిళంలో నిర్మిస్తున్న ‘పసంగ-2' చిత్రాన్ని ‘మేము' పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. సూర్య చేతుల మీదుగా విడుదలైన ‘మేము' ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. ‘మనం, దృశ్యం' చిత్రాల కోవలో ‘మేము' ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది' అన్నారు.

Surya's Pasanga 2 - Chota Bheema Video

ఈ సినిమా మానసిక వ్యాధితో బాధపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. పలువురు బాల నటులు మెయిన్ లీడ్స్‌లో నటించిన ఈ సినిమాలో సూర్య పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

‘పిశాచి' ఫేం అరోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంభాషణలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌

English summary
Watch Chota Bheema from Pasanga 2 sung by Yazhini & A.L. Srikanth in Arrol Corelli's voice. Karky pens the lyrics for this bubbly song about everything that a child's world revolves around!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu