twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ట్వీట్: దర్శకుడిపై విమర్శలు

    |

    Recommended Video

    Thala Ajith Fans Trolled Director On His Tweet | Filmibeat Telugu

    తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ రాజకీయాల్లోకి రావాలంటూ చాలా కాలంగా అభిమానుల నుంచి డిమాండ్ వినిపిస్తూనే ఉంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం అవుతున్న వేళ దర్శకుడు, రైటర్ సుశీంథరన్ చేసిన ట్వీట్ మరోసారి హాట్ టాపిక్ అయింది.

    సుశీంథరన్ ట్వీట్ చేస్తూ... కేవలం అజిత్ మాత్రమే 40 ఏళ్ల ద్రవిడియన్ పాలిటిక్స్‌లో మార్పు తేగలడు అని వ్యాఖ్యానించారు. అజిత్ రాజకీయాల్లోకి రావాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు, వారిలో నేనూ ఒకడిని, రాజకీయ ఆరంగ్రేటానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు.

    సుశీంథరన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్

    సుశీంథరన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్

    సుశీంథరన్ చేసిన ట్వీట్‌ను అజిత్ అభిమనులు స్వాగతించినప్పటికీ... చాలా మంది అతడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. తనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని అజిత్ చెప్పినా ఎందుకు ఇలాంటి ట్వీట్స్ చేస్తారంటూ మండి పడుతున్నారు.

    రాజకీయాలకు దూరంగా అజిత్

    రాజకీయాలకు దూరంగా అజిత్

    హీరో అజిత్ ముందు నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన స్టార్ ఇమేజ్ వారి పొలిటికల్ మైలేజీకి ఉపయోగించుకోకుండా రాజకీయ నాయకులకు కూడా వీలైనంత దూరంగా పాటిస్తున్నారు.

    ఫ్యాన్ క్లబ్ కూడా బ్యాన్

    ఫ్యాన్ క్లబ్ కూడా బ్యాన్

    తన పేరును ఉపయోగించి కొందరు రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో తన అభిమాన క్లబ్ కూడా అజిత్ నిషేధించారు. ఇలా ముందు నుంచి తీనపై ఎలాంటి పొలిటికల్ మార్క్ పడకుండా అజిత్ జాగ్రత్త పడుతూ వస్తున్నారు.

    ఆ కుళ్లులోకి వెళ్లడం ఇష్టం లేకే...

    ఆ కుళ్లులోకి వెళ్లడం ఇష్టం లేకే...

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో కూడా అజిత్ గురించి రూమర్స్ వచ్చాయి. జయతో చాలా క్లోజ్ రిలేషన్ ఉన్న అజిత్... ఆమె వారసుడిగా ఏఐఏడిఎంకె తరుపున రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లను అజిత్ కొట్టిపారేశారు.

    English summary
    Suseenthiran has been massively trolled over his tweet, requesting Ajith Kumar to enter politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X