For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సీతమ్మ వాకిట్లో...’ తమిళ వెర్షన్ డిటేల్స్

  By Srikanya
  |

  చెన్నై : మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈచిత్రం..... అంతకంటే ముందు రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్ 'నాయక్' చిత్రం పోటీని తట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిచింది. కొన్ని చోట్ల పాత రికార్డులను బద్దలు కొడుతూ...మరికొన్ని చోట్లు సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళంలో డబ్బింగ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

  తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్రస్తుతం తమిళ ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమా 'ఆనందం ఆనందమే'గా అనువాదమవుతోంది. విజి క్రియేషన్స్‌ బ్యానరుపై తాళ్లపల్లి చంద్రశేఖర్‌, ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌, మహేష్‌బాబు అన్నదమ్ములుగా నటించి ఆంధ్రులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇక అంజలి గోదావరి యాసలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందాలతార సమంత కూడా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మిక్కీ జే మేయర్‌, మణిశర్మ సంగీతం అందర్నీ అలరించింది. తమిళంలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

  చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఓ అచ్చమైన తెలుగు సినిమా వెల్లువరిసింది. హద్దులు దాటిన ప్రేమ పిచ్చి, అసభ్యమైన సన్నివేశాలు, భయం పుట్టించే హింసాత్మక సన్నివేశాలు, ద్వందార్థాలతో వచ్చే చండాలమైన డైలాగులు, బూతు సన్నివేశాలు తప్ప ఈతరం తెలుగు సినిమాల్లో ఇంతకు మించి ఇక ఏమీ ఉండదని, కుటుంబ సమేతంగా చూసే స్వచ్చమైన సినిమాలు ఇక రావేమో అని సగటు కుటుంబ ప్రేక్షకుడు ఆందోళన చెందుతున్న తరుణంలో.... ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన అందమైన కథాంశం ఫ్యామిలీ ప్రేక్షక రంజక సినిమా మన ముందుకు వచ్చింది 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.

  మొదట్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ రేటు మరీ ఎక్కువ చెప్పటంతో ఎవరూ రైట్స్ తీసుకోలదేని సమాచారం. దాంతో ఇప్పుడీ డబ్బింగ్ వెర్షన్ వదులుతునవ్నవట్లు చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు నటించిన ఈచిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: గుహన్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

  English summary
  2013’s most heartwarming family super-hit film Seethamma Vakitlo Sirimalle Chettu is all set to speak in Tamil under the name Anandam Anandame. The film stars superstars Mahesh Babu and Venkatesh as brothers and has Samantha and Anjali playing their respective pairs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X