»   » బూతు పాట కేసు...బయిటపడటం కోసం పూజలు

బూతు పాట కేసు...బయిటపడటం కోసం పూజలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తన కుమారుడు శింబు పై ఉన్న చట్టపరమైన కేసులు అన్నీ తొలగాలని ప్రత్యేకమైన పూజలు, యజ్ఞం నిర్వహించారు టి.రాజేంద్ర. కాంచీపురంలో ఉన్న ప్రధానదేవాలయంలో ఈ పూజలు చోటు చేసుకున్నారు. ఈ పూజలు అనంతరం తనను కలిసిన మీడియాతో ...తన కుమారుడు ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో సపోర్ట్ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు.

శింబు కేసు విషయానికి వస్తే.... సైదాపేట కోర్టులో నటుడు శింబుపై బీప్‌సాంగ్‌కు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలను పిటిషన్‌దారులు ఉపసంహరించుకున్నారు. అనిరుధ్‌ సంగీతంలో నటుడు శింబు పాడినట్లు ప్రచారమైన ‘బీప్‌సాంగ్‌' ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పాట మహిళలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ శింబుపై నగరంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

వీసీకే ఆధ్వర్యంలో దక్షిణ చెన్నై జిల్లా న్యాయవాదుల విభాగం కార్యదర్శి కాశి సైదాపేటలో దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చింది. ఆయన పార్టీ అధిష్ఠానం సూచన మేరకు ఉపసంహరణ నిర్ణయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేకేనగర్‌ ప్రాంతానికి చెందిన వీసీకే నేత పుదియవన్‌ వేసిన వ్యాజ్యంతోపాటు మరొకటి కూడా సంబంధికులు ఉపసంహరించుకున్నారు.

T Rajendhar performs special pooja and yagam for Simbu

మహిళలను అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో పాట రాసి, పాడారంటూ నటుడు శింబు బీప్ సాంగ్ వివాదం మొదలై అరస్ట్ ల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడులోని పలు మహిళా సంఘాల నిర్వాహకులు మండిపడుతూ ఆందోళనకు దిగారు. మరోప్రక్క శింబుపై కోవై, చెన్నైలో పలు విభాగాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు

మరో ప్రక్క బీప్‌సాంగ్‌ను అడ్డుపెట్టుకుని తమ హీరోని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు శింబు ఫ్యాన్స్ అశోశియేషన్స్ ఆరోపిస్తున్నాయి. మరోవైపు పలు సంఘాలు కూడా ఆయనకు మద్దతుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని శింబు తండ్రి టి.రాజేందర్‌ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

English summary
T Rajendhar conducted special poojas and yagam at the Sri Vazhakkarutheeswarar temple in Kanchipuram. It is believed that offering prayers at this place would free one from legal tangles.
Please Wait while comments are loading...