»   »  'ఆవారా' తో తిరుగుతున్న తమన్నా

'ఆవారా' తో తిరుగుతున్న తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమన్నా త్వరలో తెలుగు తెరపై మరోసారి మెరవనుంది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి డైరక్షన్స్ లో ఆమె తమిళంలో చేస్తున్న 'పయ్యా' చిత్రం తెలుగులో 'ఆవారా' గా డబ్బింగ్ అవుతోంది. ఈ విషయాలను తెలుగు వెర్షన్ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. 'మా సినిమా 'యుగానికి ఒక్కడు'ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న 'ఆవారా' చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరుతున్నాను' అన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ 'నేను ఇంతకు ముందు తీసిన 'రన్', 'పందెం కోడి' చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. తమిళంలో 'పయ్యా' పేరుతో, తెలుగులో 'ఆవారా' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఒక మంచి కథను స్టైలిష్‌గా చెప్పడం జరిగింది. రాంగోపాల్‌వర్మ శైలిలో భారతీరాజా కథను చెబితే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అన్నారు.

ఇక పరుత్తి వీరన్ చిత్రంతో తమిళ తెరకు పరిచయమై క్రేజ్ తెచ్చుకున్న సూర్య తమ్ముడు కార్తీ మాట్లాడుతూ... 'స్టైలిష్‌గా ఉండే రొమాంటిక్ యాక్షన్ సినిమా ఇది. చిత్రంలో తొలిభాగమంతా కారులోనే జరుగుతుంది' అన్నారు. హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ -"నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి వైవిధ్యమైన స్క్రిప్ట్‌తో దక్షిణాది భాషల్లో ఏ సినిమా రాలేదు. సినిమా మొత్తం ఎక్కువగా రోడ్ల మీద ప్రయాణంతోనే నడుస్తుంది' అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో అయిదు పాటలు ఉన్నాయి. ఆడియోను ఈ నెల మూడవ వారంలో, సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సోనియా, మిలింద్‌సోమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, చంద్రబోస్, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: మది, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్, దర్శకత్వం: లింగుస్వామి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu