»   » నా కరెక్ట్ వయస్సు ఎంతంటే: తమన్నా

నా కరెక్ట్ వయస్సు ఎంతంటే: తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు నా వయసు 21. ఇప్పటివరకు నాతో పాటు యాక్ట్ చేసిన హీరోలందరూ టీనేజ్‌లోనే కెరీర్ స్టార్ట్ చేసి, మంచి స్థానం సంపాదించినందుకు అభినందిస్తుంటారు. కొంతమంది హీరోలైతే... నాకు 21కాదు. ఇంకా తక్కువుంటాయి అంటారు. నా కరెక్ట్ ఏజ్ తెలుసుకోవడానికి పాసపోర్ట్ చూపించమని సరదాగా అడుగుతుంటారు అని చెప్తోంది తమన్నా. అలాగే తనకు చిన్నప్పుటి నుంచి తనకు హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉందని చెపుతూ.. చిన్నప్పుడు ఖాళీ దొరికితే చాలు... మా అమ్మ మేకప్ బాక్స్ తీసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు సెటిలైపోయేదాన్ని. ఒక కంటికి ఒక రంగు, మరో కంటికి మరో రంగు ఐషాడో వేసుకుని ముచ్చటపడేదాన్ని. అలాగే లిప్‌స్టిక్ వేసుకుని నన్ను నేను ఓ హీరోయిన్‌లా ఊహించుకునేదాన్ని. అప్పట్నుంచే హీరోయిన్ అవ్వాలనే కోరిక మొదలైంది అంటోంది.

ఇక తన 13వ ఏట తమన్నా ఏ చాంద్ సా రోషన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ అయ్యానని, స్కూల్ వార్షికోత్సవ వేడుకలో తనని చూసి, ఆ చిత్రనిర్మాత ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చా రని అంది. ఆ సినిమా తర్వాత తెలుగులో శ్రీ కి అవకాశం వచ్చింది. హ్యాపీడేస్ తో బ్రేక్ వచ్చింది అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా ఎన్టీఆర్ సరసన ఊసరివిల్లి చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె గతం మర్చిపోయే అమ్మాయిగా కనిపించనుంది. అలాగే రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో ఆమె డబ్బున్న అమ్మాయిగా కనిపించనుంది. వీటితో పాటు ఆమె రామ్ సరసన కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ చేస్తోంది. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నా ఆమె కొత్తగా ఏమీ కమిట్ కావటం లేదు. డేట్స్ ఖాళీ లేవని పూర్తిగా తెలుగు మీదే కాన్సర్టేట్ చేసింది.

English summary
When asked Tamanna about her age, Tamanna said that she is only 21.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu