»   » టీవీ ఛానెల్ నిర్వాకం.. రిలీజైన రోజే పైరసీ కాపీ, పోలీస్ కేసు

టీవీ ఛానెల్ నిర్వాకం.. రిలీజైన రోజే పైరసీ కాపీ, పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: చట్టాన్ని నిలదీస్తామనే మీడియా సంస్దలే...చివరకు చట్టానికి అడ్డంగా దొరకిపోవటం విషాదమే. కొత్తగా రిలీజైన సినిమాని ఏదైనా ధియోటర్లో అక్రమంగా పైరసీ చేస్తూంటే మీడియావాళ్లు వాలిపోయి అందరిముందూ పెడుతూంటారు. అలాంటి మీడియావారే తెగించి, తాజాగా రిలీజైన ఓ కొత్త చిత్రాన్ని తమ కెమెరాతో షూట్ చేస్తూ దొరికిపోతే పరిస్దితి ఎలా ఉంటుంది..ఎంత దారుణంగా ఉంటుంది.

తమిళనాడుకి చెందిన పోలీమర్ టీవి ఛానెల్ వారు అలాంటి దురాగతానికి తెగబడ్డారు. విజయ్ తాజా చిత్రం ధేరీ ని కోయంబత్తూరులోని శాంతి ధియోటర్ లో పైరసీ కోసం షూట్ చేస్తూండగా దొరికిపోయారు. విజయ్ ఫ్యాన్స్ హాల్లో షూట్ చేస్తున్న కెమెరామెన్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు.

Tamil channel Polimer TV caught shooting Vijay’s ‘Theri’ in a Coimbatore theatre

లోకల్ విజయ్ ఫ్యాన్స్ అశోశియేషన్ అధ్యక్ష్యుడు సంపత్ మాట్లాడుతూ.. "గురువారం ఉదంయ, విజయ్ ఫ్యాన్స్ ..ఓ వ్యక్తి ధియోటర్లో కెమెరా పట్టుకుని సినిమా ని షూట్ చేస్తూండటం గమనించారు. వారు ఆ కె మెరామెన్ ని షూట్ చేయటం ఆపమని అడిగారు. అయితే అందుకు కెమెరామెన్ ఒప్పుకోలేదు. దాంతో బలవతంగా ఆపుచేసి పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు. అతను ఓ ప్రెవేట్ కెమెరామెన్ అనీ, అలాంటి పనులు కోసం అప్పుడప్పుడూ నియమిస్తూంటారని ," చెప్పుకొచ్చారు.

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటిరీ అమ్మ క్రియేషన్స్ శివ మాట్లాడుతూ... "పొలిమర్ టీవి వారు ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో చాలా కాలం నుండి నిమగ్నమైన ఉన్నారు. ఇలాంటి షూటింగ్ లతో కోట్లు సంపాదించారు. అయితే మొదటిసారి పట్టుబడ్డారు," అన్నారు.

Tamil channel Polimer TV caught shooting Vijay’s ‘Theri’ in a Coimbatore theatre

మోనికా ఫిల్మ్స్ కు చెందిన సెంధిల్ ఈ విషయమై పోలీసలుకు కంప్లైంట్ చేసారు. ఆయన కోయంబత్తూరులో విజయ్ థేరి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ధేరీ చిత్రం నిర్మాత కలైపులి ధాను... పోలీమర్ టీవి ఛానెల్ పై మద్రాస్ హై కోర్టులో శుక్రవారం కేసు ఫైల్ చేసారు.

English summary
Members of the Tamil channel Polimer TV allegedly tried to shoot actor Vijay’s movie ‘Theri’ illegally in Shanthi theatre on Thursday morning in Coimbatore.Vijay fans caught the cameraman and brought him to the police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu