For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అజిత్, విజయ్ మల్టీస్టారర్.. కథ రెడీ అయ్యింది అంటూ డైరెక్టర్ సంచలన ప్రకటన!

  |

  తమిళ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇక ఇటీవల కాలంలో అయితే విజయ్ అజిత్ అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక హీరోలిద్దరూ కూడా కమర్షియల్ గా వరుసగా సినిమాలు చేసుకుంటూ వారి రేంజ్ ను కూడా పెంచుకుంటున్నారు. ఒక విధంగా విజయ్ అయితే రజనీకాంత్ కంటే ఎక్కువ స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్స్ ఆఫీసు వద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేస్తుంది అని చెప్పవచ్చు అలాగే మరొక వైపు అజిత్ కూడా చాలా కాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస హిట్స్ తో ముందుకు సాగుతున్నాడు. అతని సినిమాలు కూడా 150కోట్ల నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి.

  అయితే ఈ ఇద్దరు హీరోలు చాలా వరకు బయటి ప్రపంచంలో పెద్దగా కనిపించకుండా చాలా సైలెంట్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. వీలైనంత వరకు వారి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే విజయ్ పై మాత్రం అప్పుడప్పుడు కొన్ని రాజకీయ శక్తులు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సంగతిని పక్కన పెడితే అజిత్ విజయ్ ఇద్దరు మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

  Tamil director venkat prabhu clarification on ajith vijay multi starrer project

  అయితే కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఫ్యాన్ వార్స్ అనేవి నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అజిత్ విజయ్ అభిమానుల మధ్యలో అయితే నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ జరుగుతూనే ఉంటుంది. హీరోల ఫోటోలతో అలాగే పేర్లతో దారుణమైన ట్యాగ్స్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ఇలా చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయంపై హీరోలు ఇద్దరూ కూడా ఎప్పుడూ పెద్దగా స్పందించింది లేదు. కానీ వారిద్దరి మాత్రం కలుసుకున్నప్పుడు చాలా స్నేహంగానే ఉంటారు అని ఇతర సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు.

  ఇక రీసెంట్ గా ఒక తమిళ దర్శకుడు ఈ ఇద్దరు హీరోల కోసం పవర్ఫుల్ కమర్షియల్ మల్టీస్టారర్ కథను సిద్ధం చేసినట్లుగా క్లారిటీ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవల శింబుతో మానాడు అనే ఒక డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన దగ్గర ఒక పెద్ద కథ ఉంది అని చెప్పాడు. ఆ కథకు అజిత్ విజయ్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని వారితోనే ఆ సినిమాను చేయాలని ఉంది అని కూడా వెంకట్ వివరణ ఇచ్చాడు.

  ఇక అతను అలా తెలియజేయడం బాగానే ఉంది కానీ ఆ హీరోలతో సినిమా చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఏ హీరోను కాస్త తక్కువగా చూపించిన కూడా అభిమానులు ఏమాత్రం తట్టుకోలేరు. ఏదేమైనా వారి కలయికలో సినిమా వస్తే మాత్రం చూడాలి అని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి అలాంటి ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

  English summary
  Tamil director venkat prabhu clarification on ajith vijay multi starrer project
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X