For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాంబుతో పేల్చేస్తామంటూ నటీనటులకు,దర్శకులకు బెదిరింపు

  By Srikanya
  |

  చెన్నై: నటీనటుల నిరాహార దీక్షకు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడానికి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఇందుకు తమిళ చలన చిత్ర పరిశ్రమ సంఘీభావం తెలుపుతూ మంగళవారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు సోమవారం ప్రకటించింది.

  ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సినిమా పీఆర్వో రాధాకన్నన్‌ సెల్‌ఫోన్‌కు ఓ కాల్‌ వచ్చింది. అందులో గుర్తు తెలియని ఓ వ్యక్తి మాట్లాడుతూ నటీనటులు దీక్ష చేపట్టే ప్రాంతంలో బాంబు పెట్టనున్నట్లు చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. దీక్షను భగ్నం చేయడానికే బాంబు బెదిరింపునకు పాల్పడినట్లు భావిస్తున్నారు.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తుండగా తమిళ చలన చిత్ర పరిశ్రమ కూడా సంఘీభావం తెలిపి మంగళవారం మౌన నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శనలు కూడా రద్దు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వారికి తమిళ చలనచిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో సినిమా థియేటర్లలో మంగళవారం ప్రదర్శనలు రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సినిమా థియేటర్ల యజమానుల సంఘం ప్రకటించింది. ఆ మేరకు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు చేపాక్కం అతిథి గృహం వద్ద మంగళవారం మౌన దీక్ష చేపట్టారు.

  చలన చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులు కూర్చోడానికి అనువుగా అక్కడ వేదిక ఏర్పాటు చేయగా అందులో 'ధర్మ దేవదైక్కు అనీదియా?' (ధర్మ దేవతకు అన్యాయమా?) అనే నినాదంతో బ్యానరు ఉంచారు. దానికి ఎదురుగా ఏర్పాటు చేసిన పందిరిలో తమిళ చలనచిత్ర పరిశ్రమ వర్గాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి నిరాహారదీక్ష కొనసాగించాయి.

  ఇందులో నటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రాధారవి, నటులు భాగ్యరాజ్‌, ప్రభు, సత్యరాజ్‌, చేరన్‌, వివేక్‌, విక్రమ్‌ ప్రభు, సిబిరాజ్‌, రమేష్‌ కన్నా, నరేన్‌, నిళల్‌గల్‌ రవి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, రామరాజన్‌, సెంథిల్‌, మన్సూర్‌ అలీఖాన్‌, వెన్నిరాడై నిర్మల, సచ్చు, నళిని, బబితా, కుయిలి, సి.ఆర్‌.సరస్వతి, ఫాతిమా బాబు తదితరులు పాల్గొన్నారు.

  Tamil film industry fasts for jailed politician

  అలాగే దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్‌, దర్శకులు ఎస్‌.ఎ.చంద్రశేఖరన్‌, పి.వాసు, మనోజ్‌కుమార్‌, ఆర్కే సెల్వమణి, లింగుస్వామి, ఎళిల్‌, పవిత్రన్‌, రవి మరియా, నిర్మాతలు కేయార్‌, సత్యజ్యోతి త్యాగరాజన్‌, కలైపులి థాను, కేటీ కుంజుమోన్‌, ఫెప్సీ విజయన్‌, ఫెప్సీ కార్యదర్శి శివ, థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్‌, సంగీత దర్శకులు దేవా, శంకర్‌ గణేష్‌, చలన చిత్ర పరిశ్రమలోని పలు విభాగాలకు చెందిన వందలాది మంది దీక్షలో పాల్గొన్నారు. నిరాహారదీక్ష సందర్భంగా అక్కడ పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  తమిళనాడు సినిమా థియేటర్ల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన తేనాంపేటలోని ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం సినిమా థియేటర్ల యజమానులు నిరాహారదీక్ష చేశారు. ఇందులో సినిమా థియేటర్ల యజమానులు హరి గోవింద్‌, లేనాసుబ్బు, గజేంద్రన్‌, మనోహరన్‌, శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్షల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సినిమా థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేశారు. దీంతో అన్ని సినిమా థియేటర్లు మూతపడి కనిపించాయి.

  English summary
  The film industry in India's Tamil Nadu state is on a day-long fast to protest against the jailing of former chief minister Jayaram Jayalalitha.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X