»   » రవితేజ 'డాన్ శీను' చిత్రాన్ని కాపీ కొట్టే...

రవితేజ 'డాన్ శీను' చిత్రాన్ని కాపీ కొట్టే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tamil Film inspired from Don Seenu?
చెన్నై : ఓ బాషలో విజవంతమైన చిత్రాన్ని కొద్దిగా అటు ఇటుగా మార్చి సినిమాలు చేయటం అన్ని పరిశ్రమలో ఉన్నదే. అయితే తాజాగా తమిళంలో 'అదువేర ఇదువేర' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగులో వచ్చి విజయవంతమైన రవితేజ డాన్ శీను చిత్రానికి పోలికలు ఉన్నాయని తమిళ చిత్ర పరిశ్రమలో వినపడుతోంది. కొద్దిగా ఎత్తుగబడ మార్చి సినిమా తయారు చేసారని చెప్తున్నారు.

టూరింగ్‌ టాకీస్‌లల్లో రజనీకాంత్‌ సినిమాలు చూసే అభిమానే ఈ చిత్ర హీరో. అతనికి 'బాషా' చిత్రం అంటే చాలా ఇష్టం. ఎన్నో సార్లు చూశాడు. అలా ఓ సారి 'బాషా'లా దాదా అవ్వాలని చెన్నైకి వస్తాడు. ఆ తర్వాత అతను దాదా అయ్యాడా? లేదా? అన్నదే కథ.. కాస్త హాస్యంగానూ, కమర్షియల్‌గానూ కథాంశాన్ని రచించాం. క్త్లెమాక్స్‌ కొత్తగా ఉంటుంది. తొలిచిత్రంతోనే వర్షన్‌ ప్రేక్షకులు మరింత దగ్గరయ్యే అవకాశం ఈ చిత్రంలో నిండుగా ఉందని దర్శకుడు తిలకరాజన్ చెప్పుకొచ్చారు.

పవర్‌ఫుల్‌ మీడియా బ్యానరుపై జయశీలన్‌ నిర్మిస్తున్న చిత్రం 'అదువేర ఇదువేర'. హాస్యనటుడు జయమణి కుమారుడు వర్షన్‌ ఇందులో హీరోగా పరిచయమవుతున్నాడు. సానియాతార కథానాయిక. ఇందులో ఇమాన్‌ అన్నాచ్చి, గంజాకరుప్పు, పొన్నంబలం, సింగముత్తు తదితరులు నటిస్తున్నారు. తాజ్‌నూర్‌ సంగీతం సమకూర్చారు. నా.ముత్తుకుమార్‌ పాటలు రాశారు. తిలకరాజన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లొచ్చింది. ఓ సన్నివేశాన్ని తొలగించి సెన్సార్‌ అధికారులు 'యు' సర్టిఫికేట్‌ అందజేశారు.

ఇక ఈ చిత్రం తెలుగులో వచ్చిన రవితేజ డాన్ శీను కి పోలికలు ఉన్నాయని తమిళ పరిశ్రమలో వినపడుతోంది. ఇక్కడ తెలుగులో రజనీకాంత్ డాన్ సినిమా చూసి..డాన్ లా మారాలనుకునే వ్యక్తి కథ ఇది. తమిళంలో డాన్ చిత్రం ప్లేస్ లోకి ...బాషా ని తీసుకువచ్చి స్క్రీన్ ప్లే మార్చి కథ రాసాడంటన్నారు. మరి ఏ విషయం సినిమా రిలీజ్ అయితే గానీ తెలయదు.

English summary
Adhu Vera Idhu Vera is an tamil comedy movie direction by debut director Thilagarajan M. The Movie starring with new faces and Imman Annachi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu