»   » విశాల్ పోరాడి గెలిచాడు.... సస్పెన్షన్ ఎత్తేసారు

విశాల్ పోరాడి గెలిచాడు.... సస్పెన్షన్ ఎత్తేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో విశాల్‌‌పై ఉన్న నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్‌‌ను ఎత్తివేసింది. మండలి నుంచి అన్యాయంగా తనను తొలగించారని విశాల్ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న మద్రాస్ హైకోర్టు నిశితంగా విచారించిన తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్మాతల మండలికి కోర్టు ఆదేశాలిచ్చింది.

దీంతో నిర్మాత మండలి సస్పెన్షన్ ఎత్తివేసింది. మొత్తానికి సస్పెన్షన్ విషయంలో విశాల్‌‌కు ఊరట లభించినట్లైంది. తమిళ నిర్మాతల మండలి తీరుపై ఆగ్రహించి.. సమస్యలను తీర్చకుండా కట్ట పంచాయితీ నిర్వహిస్తున్నారని మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మండలి విశాల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శితో పాటు నిర్మాతల మండలిలోనూ సభ్యుడే. త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో విశాల్ తరపున బృందం గట్టిపోటీ చేయనుందని సమాచారం.

Tamil Film Producers Council revokes actor Vishal's suspension

సంవత్సరం క్రితం విశాల్ ఓ వారపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ నకిలీ సినిమా సీడీలను నిరోధించడం లో నిర్మాతల సంఘం పూర్తిగా విఫలం అయ్యిందని, ఆ సంఘం సమావేశాలు బొండాలు, బజ్జీలు తినడానికే పరిమితమయ్యారని విమర్శించాడు విశాల. ఆ విమర్శలపై స్పందించిన నిర్మాతల సంఘం అయన సంజాయిషీ నోటీసు జారీ చేసింది.

ఆ మేరకు విశాల్ సంజాయిషీ ఇచ్చిన అయన వివరణ సంతృప్తిగా లేదని సంఘం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారి చేసింది. అప్పటినుంచీ విశాల్ నిర్మాతల సంఘం తో పోరాడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్లకి ఈ విషయం లో విశాల్ విజయం సాధించాడు. నిన్న కోర్టు తీర్పు వెలువడగానే విశాల్ పై వేటు ని ఉపసంహరించుకుంది నిర్మాతల మండలి. విశాల్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.

English summary
The Tamil Nadu Film Producers' Council (TFPC) today informed the Madras High Court that it has revoked the suspension of actor Vishal on the basis of an apology letter submitted by him over his alleged remarks in a Tamil magazine against the film body.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu