»   » సంగీత దర్శకుడు ఆదిత్యన్ మృతి

సంగీత దర్శకుడు ఆదిత్యన్ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్‌ మంగళవారం రాత్రి మరణించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. కూతురిని చూసేందుకు హైద‌రాబాద్‌ వ‌చ్చిన ఆదిత్య‌న్ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు. ఆయన మరణానికి కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణమని తెలుస్తోంది.

90ల్లో ఆదిత్యన్ పలు తమిళం, మలయాళం, తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. అమరన్, సీవల్ పేరి పాండి, కోవిల్పట్టి వరలక్ష్మి లాంటి హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. అంతే కాకుండా తమిళ పాప్, రీమిక్స్ ఆల్బమ్స్ ఇండియా, మలేషియాలో విడుదల చేశారు.

Tamil music composer Adithyan passes away at 63

ఆదిత్యన్స్ కిచెన్ పేరుతో జయా టీవీలో ఆయన దాదాపు 8 సంవత్సరాల పాటు కుకింగ్ షో హోస్ట్ చేశారు. ఆదిత్యన్ మరణంపై పలువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. రేపు చెన్నైలో ఆయ‌న‌ అంత్యక్రియలు జరుగనున్నాయి.

English summary
Popular Tamil music composer Adithyan passed away in Hyderabad this morning reportedly due to kidney failure. He was 63. Adithyan has composed music for Tamil, Malayalam and Telugu films in the 90s.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu