twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో ఇంటికి సీఎం.. ఊహించని షాక్ ఇచ్చిన హీరో!

    |

    తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ రోజు తమిళ నాయకుడు,ఒకప్పటి స్టార్ హీరో విజయకాంత్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ ఆకస్మిక కలయిక చాలా ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఉదయం తమిళ నాయకుడు విజయ్ కాంత్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లో చురుకుగా లేని విజయకాంత్ ఆరోగ్యం గురించి స్టాలిన్ ఈ రోజు వ్యక్తిగతంగా విచారించారు. అయితే ఆయన ఆరోగ్యం గురించి పరిశీలించడానికి వెళితే ఈ సమావేశంలో విజయకాండ్ కరోనా రిలీఫ్ ఫండ్ కోసం రూ .10 లక్షలను ముఖ్యమంత్రికి అందజేసి షాక్ ఇచ్చారు.

    ఇక డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎంపీ బిఈ రాసా కూడా సమావేశంలో హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసిన విజయకాంత్, చేతులు గట్టిగా పట్టుకున్నాడు. విజయకాంత్ స్టాలిన్ పక్కన కూర్చుని అతని ఆరోగ్యం గురించి విచారించారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య కొన్ని చేదు సంఘటనలు చోటు చేసుకోగా ఈ సమావేశం వాటిని క్లియర్ చేసింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సమావేశం నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో విజయ్ కాంత్ బహుశా డీఎంకే కూటమిలో చేరతారా అనే అనుమానాలు తలెత్తాయి అని చెప్పాలి.

    అంతకుముందు, గత నెలలో డీఎంకే అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్ విజయకాంత్ ను వ్యక్తిగతంగా కలిశారు. ఆయన ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న ఉదయనిది ఆయనని పరామర్శించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినందుకు ఉదయనిధి విజయకాంత్ అభినందించడం గమనార్హం. ఇక ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి విజయకాంత్‌ను కలిశారని చెప్పచ్చు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఈ ఇద్దరి కలయిక ఇప్పుడు రాజకీయ చర్చలకు కూడా తావిస్తోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

     Tamil Nadu Chief Minister MK Stalin visited DMDK president Vijayakanth

    English summary
    Tamil Nadu Chief Minister MK Stalin today visited DMDK president Vijayakanth at his resident to enquire about his health. During the meeting the latter gave a cheque for Rs 10 lakh towards Covid Relief fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X