Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రజనీ, చిరు, బాలయ్య, అప్పటి హీరోయిన్లతో అంబరీష్ : అరుదైన ఫోటో షేర్ చేసిన రాధిక!
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ మరణం సౌత్ సినీ ప్రముఖులను విషాదంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో అంబరీష్ గురించి గుర్తు చేసుకుంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ షేర్ చేసిన ఓ అరుదైన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
80'స్ సౌత్ స్టార్స్ అంతా ప్రతి ఏడేది ఒకే చోట కలిసి వేడుక చేసుకోవడం తెలిసిందే. మూడేళ్ల క్రితం జరిగిన 80'స్ స్టార్ మీట్‌లో రజనీ, చిరంజీవి, బాలయ్యతో పాటు అంబరీష్, ఆయన భార్య సుమలత కూడా పాల్గొన్నారు.
|
అంబరీష్ గురించి రాధిక
‘అంబరీష్ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎంతో మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చలేనిది. నా ఫ్రెండ్ సుమలత, వారి ఫ్యామిలీకి ఇది తీరని లేటు. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలి' అని ట్వీట్ చేశారు.
|
రజనీకాంత్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. గొప్ప మనసున్న వ్యక్తి, నా స్నేహితుడు నాకు దూరమయ్యాడు. ఇక ముందు నీవు లేవన్న విషయంతో దు:ఖంలో మునిగిపోయాను. నీ ఆత్మకు శాంతి కలుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని రజనీ ట్వీట్ చేశారు.
|
మీరెప్పుడూ మా గుండ్లో ఉంటారు
మీరెప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు సర్ అంటూ.... ప్రముఖ నటి ఖుష్భూ ట్వీట్ చేశారు.

అంబరీష్
అంబరీష్ నాగరహావు అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత జలీలా అనే సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించారు. ఇప్పటి వరకు ఆయన 200 చిత్రాలకు పైగా నటించారు. అంబరీష్ చివరి చిత్రం అంబీ నింగ్ వయాస్సేథో.